ఉన్నట్టుండి ఛాతి నొప్పి: ఆసుపత్రిలో చేరిన బ్రియాన్ లారా

హైదరాబాద్: వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించారు. దీనిపై మాట్లాడేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లాండ్ వేదికగా జరుతున్న ప్రపంచకప్‌లో బ్రియాన్ లారా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న లారాకు ఉన్నట్టుండి ఒక్కసారిగా లారాకు ఛాతిలో నొప్పి వచ్చింది.
దీంతో వెంటనే ఆయన్ను సమీపంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో లారాను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Story first published: Tuesday, June 25, 2019, 19:13 [IST]
Other articles published on Jun 25, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications