బాబోయ్ ఇక ఆపండి.. నాకు క‌రోనా లేదు: విండీస్ దిగ్గజం

ట్రినిడాడ్: త‌నపై వ‌స్తున్న అసత్య ప్రచారాలను వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియ‌న్ లారా ఖండించారు. తనకు కరోనా సోకలేదని స్పష్టం చేసారు. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, నెగెటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతున్నన్నారు. ప్ర‌తికూల‌త‌ను వ్యాప్తి చేయ‌డానికి క‌రోనా మ‌హ‌మ్మారిని ఒక సాధనంగా ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను బ్రియ‌న్ లారా కోరారు. ఇలాంటి పరిస్థితిలో పుకార్లు భయాందోళనలకు గురిచేస్తాయన్నారు.

త‌నపై వ‌స్తున్న అసత్య ప్రచారాలపై బ్రియ‌న్ లారా ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించాడు. 'అందరికీ నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని అసత్య ప్రచారాలను చూసాను. అందుకే వాస్తవాలను చెప్పాలని స్పందిస్తున్నా. క‌రోనాతో బాధ‌ను అనుభ‌విస్తున్న స‌మాజంలో ఇలాంటి అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌చారం చేసి, భ‌యాందోళ‌న‌ల‌ను వ్యాప్తిచేయ‌డం మంచిదికాదు. నాకు నెగెటివ్ వచ్చింది. ఇలాంటి వార్త‌ల‌తో నన్ను ఏమాత్రం ప్ర‌భావితం చేయలేరు. కానీ త‌న చుట్టూ ఉన్న‌వారిని మాత్రం ఆందోళ‌న‌కు గురిచేశారు' అని లారా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

'కరోనా వైరస్ మహమ్మారిని సంచలనాన్ని సృష్టించడానికి ప్రతికూల పద్ధతిలో ఉపయోగించరాదు. కోవిడ్-19 బారిన పడకుండా మనమందరం సురక్షితంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందరూ బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియ‌న్ లారా పేర్కొన్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో లారా 131 టెస్టుల్లో, 299 వన్డే మ్యాచ్‌ల్లో విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో క్వాడ్రపుల్‌ సెంచరీ (400*నాటౌట్‌) సాధించిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్‌ చేయలేకపోయాడు.

బ్రయన్‌ లారా ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు సాధించి క్రికెట్‌ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. అదే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్. 1994 జూన్‌ 6న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా లారా (501*) వార్విక్‌షైర్‌ జట్టు తరఫున ఆడుతూ.. దర్హమ్‌ జట్టుపై ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పాడు. ఇది ప్రపంచ క్రికెట్‌లోనే అరుదైన ఘనత. అంతకుముందు పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ హనీఫ్‌ మహ్మద్‌ (499) కరాచీ జట్టు తరఫున 1959లో బహవాల్పూర్‌ జట్టుపై అత్యధిక పరుగులు సాధించాడు.

IPL 2020: 6 రోజుల క్వారంటైన్‌కు అంగీకరించిన ఫ్రాంఛైజీలు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 6, 2020, 15:49 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X