Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వివ్ రిచ‌ర్డ్స్‌కు కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేశా: బ్రియాన్ లారా

హైదరాబాద్: వ‌ర‌ల్డ్ క్రికెట్ చూసిన అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌లో వెస్టిండిస్ లెజెండ్ బ్రియాన్ లారా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ కూడా ఒకానొక స‌మ‌యంలో మ‌రో లెజెండ్ వివ్ రిచ‌ర్డ్స్‌కు డ్రైవ‌ర్‌గా ప‌నిచేశాన‌ని చెప్పుకోవ‌డం విశేషం.

లండన్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో మంగ‌ళ‌వారం ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కౌడ్రీ లెక్చ‌ర్ సందర్భంగా లారా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. క్రికెటర్‌గా 1991లో తొలిసారి త‌న ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌ను ఈ సందర్భంగా లారా గుర్తు చేసుకున్నాడు.

Brian Lara

ఆ రోజుల్లో తనది వాటర్ బోయ్ పాత్ర అని లారా చెప్పుకొచ్చాడు. తుది జట్టులో స్థానం లభించలేదని, దీంతో ఒక టూర్ గేమ్‌కు వివ్ రిచర్డ్స్‌తో పాటు వెళ్లానని తెలిపాడు. ఓ టూర్ గేమ్‌లో 25 ఓవ‌ర్లు బౌలింగ్ చేయ‌డంతోపాటు అదే టూర్‌లో వివ్ రిచ‌ర్డ్స్‌కు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన‌ట్లు లారా చెప్పాడు.

'ఓ టూర్ గేమ్‌లో ఎవ‌రైనా బౌలింగ్ చేస్తారా? అని రిచ‌ర్డ్స్ అడిగితే నేను చేస్తా అన్నాను. ఏడు ఓవ‌ర్ల పాటు లెగ్ బ్రేక్స్‌, గూగ్లీస్ వేసి ఇక చాల‌న్నాను. అయినా ఇంకా చేయాల్సిందే అని రిచ‌ర్డ్స్ చెప్ప‌డంతో త‌ప్ప‌లేదు. అలా 25 ఓవ‌ర్లు వేశాను. చివ‌రికి ఒక్క వికెట్ కూడా తీయ‌కుండా 130 ర‌న్స్ ఇచ్చాను' అని లారా ఆ ఘ‌ట‌నను గుర్తు చేసుకున్నాడు.

అలాగే, ఆ రోజుల్లో రిచ‌ర్డ్స్‌కు గిఫ్ట్‌గా వ‌చ్చిన కారు కీని తనకు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఆ టూర్ మొత్తం ఆ కారుకి డ్రైవర్‌ను తానేనని లారా చెప్పాడు. 'ఆ రోజుల్లో రిచ‌ర్డ్స్‌కు గిఫ్ట్‌గా వ‌చ్చిన కారు తాలూకు కీని అత‌ను నాకు ఇచ్చాడు. ఇక ఆ టూరంతా రిచ‌ర్డ్స్ ప్యాసెంజ‌ర్ సీట్‌లో కూర్చుంటే.. నేను ఇంగ్లండ్ మొత్తం తిప్పి చూపించా. ఆ టూర్ మొత్తంలో నాకు ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం కూడా రాలేదు' అని లారా అన్నాడు.

గత కొన్నేళ్లుగా క‌ళ త‌ప్పిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఈ మ‌ధ్యే ఇంగ్లండ్‌పై చిరస్మ‌ర‌ణీయ విజ‌యం సాధించ‌డంపై లారా ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇది ప్ర‌పంచ క్రికెట్‌కు అవ‌స‌ర‌మైన విజ‌యం అని లారా అన్నాడు. స‌చిన్ కూడా త‌న‌తో ఇదే చెప్పాడ‌ని ఈ సంద‌ర్భంగా లారా వెల్ల‌డించాడు. ఇక, వెస్టిండిస్ జట్టుపై కామెంట్ చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ జెఫ్రీ బాయ్‌కాట్‌ను లారా త‌ప్పుబ‌ట్టాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+