Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కెప్టెన్సీ చూడడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా: బ్రెట్ లీ

Brett Lee says Virat Kohli and Ricky Ponting have similar captaincy styles

సిడ్నీ: టీమిండియా ​కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చూడడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా అని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్​ కెప్టెన్సీ మధ్య చాలా పోలికలు ఉన్నాయని బ్రెట్ లీ పేర్కొన్నాడు. కోహ్లీ-పాంటింగ్ ఇద్దరూ ఎంతో దూకుడుగా ఉంటారని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. జట్టు కోసం విరాట్ నిరంతరం తపిస్తాడని అన్నాడు. బ్రెట్‌ లీ ఆసీస్ తరఫున 76 టెస్టులు, 221 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.

'కెప్టెన్సీలో ప్రతి ఒక్కరికీ విభిన్నమైన స్టైల్ ఉంటుంది. విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్​ కెప్టెన్సీని గమనిస్తే.. చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. సారథ్యంలో ఇద్దరి శైలి ఒకేలా ఉంటుంది. ఇద్దరిలో సహజంగా దూకుడు కనిపిస్తుంది. నేను విరాట్ కెప్టెన్సీ చూడడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా. అతడు ఎంతో అంకితభావంతో, పట్టుదలతో ఉంటాడు. జట్టు కోసం రాణించాలని కోహ్లీ నిరంతరం తపన పడుతుంటాడు' అని బ్రెట్ లీ చెప్పాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా ప్రశంసలు పొందుతున్నాడు. మరోవైపు కెప్టెన్సీలోనూ అదరగొడుతున్నాడు. అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు తొలిసారి టెస్టు సిరీస్​ (208-19)ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 1947 నుంచి భారత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా 2018 వరకు ఒక్క టెస్టు సిరీస్‌‌లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ తరంలో గొప్ప క్రికెటర్లైన విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లో ఎవరు అత్యుత్తమో ఎంచుకోవడం చాలా కష్టమని గతంలో బ్రెట్‌ లీ అన్నాడు. 'స్మిత్, కోహ్లీలలో ఒకర్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే.. వారిద్దరిలోని చాలా లక్షణాలను నేను ఇష్టపడతాను. అయితే బౌలింగ్‌ దృష్టికోణం నుంచి వివరిస్తా. స్మిత్, కోహ్లీ భిన్నమైన ఆటగాళ్లు. కోహ్లీ గురించి చెప్పాలంటే.. సాంకేతికంగా బలమైనవాడు. 'వి' షేపు నుంచి బంతిని తరలిస్తాడు. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువగా ఆఫ్‌సైడ్‌ ది ఆఫ్‌స్టంప్‌ బంతులకు దొరికిపోయేవాడు. ఇప్పుడెంతో మెరుగయ్యాడు. ఎంతో సాధన చేసి తన బలహీతనను అధిగమించాడు. కోహ్లీ చాలా క్రమశిక్షణతో ఆడతాడు. దేహదారుడ్యంలో తిరుగులేదు. సారథ్యం అమోఘం' అని బ్రెట్ ‌లీ అన్నాడు.

Story first published: Monday, July 27, 2020, 21:37 [IST]
Other articles published on Jul 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+