
సూపర్ స్టార్ట్..
ఆసీస్- భారత్ వంటి మేటి జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీకి మంచి ఆరంభం దక్కనుందని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.
‘ఆస్ట్రేలియాలోని క్రికెట్ మైదానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. వీటిని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తారు. ఇలాంటి మైదానాల్లో మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ చూడటం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన, టెస్టుల్లో అరంగేట్రం చేసిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరగనుండటం ఇంకా అద్భుతంగా ఉంది. 'అని బ్రెట్ లీ తెలిపాడు.

ఆకాశమే హద్దు..
ఊహించిన స్థాయిలో మహిళా క్రికెటర్లు రాణిస్తే వారికి ఆకాశమే హద్దని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘మహిళా క్రికెటర్లు ఎదుగుతున్న తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా ఈవెంట్ ఎన్నెన్నో మధురానుభూతులను మిగుల్చుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. భారత్ విషయానికొస్తే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి బ్యాటర్లతో జట్టు దృఢంగా ఉంది. ఊహించిన స్థాయిలో మహిళా క్రికెటర్లు రాణిస్తే.. వారికి ఆకాశమే సరిహద్దు అనే మాట నిజమవుతుంది' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.

మూడు సార్లు సెమీస్‌కు
ఇది ఏడో మహిళా టీ20 ప్రపంచకప్ కాగా... ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) టైటిల్ గెలుచుకుంది. ఇక ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2018) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది. కానీ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇక ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు.

ప్రాక్టీస్‌లో అదుర్స్..
ఈ మెగా టైటిలే లక్ష్యంగా పెట్టుకున్న భారత మహిళల జట్టు మూడు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకుంది. మెగా టోర్నీ సన్నాహకంలో భాగంగా జరిగిన ముక్కోణపు టోర్నీలో హర్మన్ సేన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినప్పటికి.. మెగా టోర్నీకి కావాల్సిన ప్రాక్టీస్ లభించింది. బుధవారం వెస్టిండీస్ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌తో 2 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.