Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్ కు బ్రెట్ లీ గుడ్ బై

Brett Lee
సిడ్నీ: టెస్టు క్రికెట్ నుంచి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తన రిటైర్ మెంటును ప్రకటించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగే ఉద్దేశంతో అతను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గాయాలు ఆయన క్రికెట్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. 1999 - 2000ల మధ్య కాలంలో అతను 76 టెస్టులు ఆడాడు. నిరుడు జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచు కూడా ఆడలేదు.

ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉందని, శరీరాన్ని కాపాడుకుని తన దేశానికి ఇంకా ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని బ్రెట్ లీ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెట్ లీ 310 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో బ్రెట్ లీ అద్భుతమైన ఆస్టేలియాకు సేవలు అందించాడని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సూదర్లాండ్ అన్నారు. గొప్ప క్రికెట్ ఆటగాళ్లలో లీ ఒకడని ఆస్టేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+