Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ vs స్మిత్‌.. ప్రస్తుతానికి నా ఓటు అతనికే: బ్రెట్‌లీ

Brett Lee rates Steve Smith over Virat Kohli

సిడ్నీ: ప్రసుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీలలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు మాజీలు కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అంటే.. మరికొందరు స్మిత్ అన్నారు. ఈ చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. అయితే స్మిత్‌, కోహ్లీలలో ఎవరు బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ ‌లీ తన అభిప్రాయాన్ని తాజాగా తెలిపాడు.

ఎవరు అత్యుత్తమో ఎంచుకోవడం కష్టం:

ఎవరు అత్యుత్తమో ఎంచుకోవడం కష్టం:

ఈ తరంలో గొప్ప క్రికెటర్లైన విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లో ఎవరు అత్యుత్తమో ఎంచుకోవడం చాలా కష్టమని బ్రెట్‌ లీ అన్నాడు. ఇద్దరూ అద్భుతంగా ఆడతారన్నాడు. ఇప్పటికిప్పుడు ఎంచుకోమంటే మాత్రం స్మిత్‌కే ఓటేస్తానని, అదే రేపు అడిగితే కోహ్లీ పేరు చెప్పొచ్చని వెల్లడించాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్‌ పొమీ ఎంబగ్వా అడిగిన ప్రశ్నలకు లీ ఇలా సమాధానం ఇచ్చాడు. బ్రెట్‌ లీ ఆసీస్ తరఫున 76 టెస్టులు, 221 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.

కోహ్లీ క్రమశిక్షణతో ఆడతాడు:

కోహ్లీ క్రమశిక్షణతో ఆడతాడు:

'స్మిత్, కోహ్లీలలో ఒకర్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే.. వారిద్దరిలోని చాలా లక్షణాలను నేను ఇష్టపడతాను. అయితే బౌలింగ్‌ దృష్టికోణం నుంచి వివరిస్తా. స్మిత్, కోహ్లీ భిన్నమైన ఆటగాళ్లు. కోహ్లీ గురించి చెప్పాలంటే.. సాంకేతికంగా బలమైనవాడు. 'వి' షేపు నుంచి బంతిని తరలిస్తాడు. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువగా ఆఫ్‌సైడ్‌ ది ఆఫ్‌స్టంప్‌ బంతులకు దొరికిపోయేవాడు. ఇప్పుడెంతో మెరుగయ్యాడు. ఎంతో సాధన చేసి తన బలహీతనను అధిగమించాడు. కోహ్లీ చాలా క్రమశిక్షణతో ఆడతాడు. దేహదారుడ్యంలో తిరుగులేదు. సారథ్యం అమోఘం' అని బ్రెట్ ‌లీ అన్నాడు.

స్మిత్‌కే ఓటేసిన బ్రెట్‌లీ:

స్మిత్‌కే ఓటేసిన బ్రెట్‌లీ:

'స్టీవ్ ‌స్మిత్‌ విషయానికి వస్తే.. రెండేళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ తర్వాత అద్భుతంగా ఆడి మళ్లీ తన స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. అతడు చాలా భిన్నమైన బ్యాట్స్‌మన్‌. చురుగ్గా ఉంటాడు. కానీ సేదతీరినట్టుగా కనిపిస్తాడు. అదే అతడిని భిన్నంగా మార్చేసింది. ప్రస్తుతానికి ఇద్దరిలో నేను స్మిత్‌ను ఎంచుకుంటాను. అదే రేపు అడిగితే కోహ్లీ పేరు చెప్పొచ్చు. ఇద్దరికీ వెంట్రుకవాసిలో తేడా ఉంటుందేమో. స్మిత్‌ అయితే బ్రాడ్‌మన్‌ సమాన స్థాయి ఆటగాడు. అతడి గణాంకాలే ఈ విషయాన్ని చెబుతాయి' అని లీ చెప్పాడు.

సెంచరీలు, పరుగులలో పోటీ:

సెంచరీలు, పరుగులలో పోటీ:

స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్టులలో సెంచరీలు చేయడంలో పోటీ పడుతున్నారు. అలాగే ర్యాంకుల్లో కూడా. 73 టెస్ట్ మ్యాచ్‌లలో స్మిత్‌ 26 సెంచరీలు చేయగా.. 86 టెస్ట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 27 సెంచరీలు చేసాడు. స్మిత్ 55.3 సగటుతో 7227 పరుగులు చేయగా.. కోహ్లీ 57.7 సగటుతో 7240 పరుగులు చేసాడు. ఇద్దరూ సెంచరీలు, పరుగులలో పోటీ పడుతున్నారు.

Story first published: Wednesday, May 27, 2020, 8:14 [IST]
Other articles published on May 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+