మామూలు పేసరా అతను.. ఇండియన్ ఎవర్‌గ్రీన్, కేకేఆర్ ప్లేయర్‌పై బ్రెట్‌లీ ప్రశంసల వర్షం

ఈ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న పేసర్ ఉమేష్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, పేస్ దిగ్గజం బ్రెట్‌లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఉమేష్ యాదవ్ ఇండియన్ ఎవర్ గ్రీన్ ప్లేయర్ అని, అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడని, ఈ ఐపీఎల్లో రానున్న మ్యాచ్‌ల్లో తప్పకుండా 5వికెట్ల హౌల్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉమేష్ యాదవ్ తన పదునైన బౌలింగ్‌తో ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 10వికెట్లు తీశాడు. ప్రస్తుతం కేకేఆర్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసింది ఉమేష్ యాదవే.

అద్భుతమైన కంట్రోల్‌తో బౌలింగ్
తన యూట్యూబ్ ఛానల్ బ్రెట్‌లీ టీవీ వీడియోలో బ్రెట్‌లీ మాట్లాడుతూ.. 'ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఉమేష్ యాదవ్ ప్రదర్శనను మనం చూశాం. అతను చాలా అద్భుతమైన కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. సూపర్ స్వింగ్‌ని తన బౌలింగ్‌లో చూపిస్తున్నాడు. రెండు వైపులా స్వింగ్ చేసే కేపబిలిటీ ఉమేష్ యాదవ్ సొంతం.. అలాగే సీమ్ పరంగా వేగాన్ని కన్సిస్టెన్సీగా కొనసాగిస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీసి మ్యాచ్‌ను కేకేఆర్ వైపు తిప్పడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు' అంటూ ఉమేష్ బౌలింగ్ సమర్థతను కొనియాడాడు.

సిసలైన టీ20 ప్లేయర్
ఉమేష్ యాదవ్ ప్రదర్శనను విశ్లేషిస్తూ.. 'ఈ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్కేతో కేకేఆర్ తలపడగా.. ఆ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్.. గైక్వాడ్, డెవాన్ కాన్వే లాంటి హిట్టర్లను ఔట్ చేసి కేకేఆర్‌కు బ్రేకిచ్చాడు. 4ఓవర్లలో 2/20తో మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే 15డాట్ బాల్స్ వేశాడు. నా ఉద్దేశం ప్రకారం.. టీ20ల్లో ఒక బౌలర్ 12డాట్ బాల్స్ లేదా అంతకంటే ఎక్కువ వేస్తే అతను సిసలైన టీ20బౌలర్ అని పేర్కొంటాను. అలాగే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 2/16తో.. రావత్, విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా 14డాట్ బాల్స్ వేశాడు. ఇక 4/23 ప్రదర్శనతో పంజాబ్‌పై చెలరేగాడు. మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ మ్యాచ్‌లో 13డాట్ బాల్స్ సంధించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. అతను బౌలింగ్లో నిప్పులు చెరుగుతున్నాడనడానికి ఇంతకంటే ఏం చెప్తాం. అతను ఈ ఐపీఎల్లో ఒక ఫైఫర్ (ఒకే మ్యాచ్‌లో అయిదు వికెట్లుతీయడం) సాధిస్తాడని నేను భావిస్తున్నా' అని పేర్కొన్నాడు.

ఏడోస్థానంలో కేకేఆర్
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఈ ఐపీఎల్లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడి విజయంతో సీజన్‌ను ప్రారంభించింది. తన రెండో మ్యాచ్‌లో కేకేఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమిని చవిచూసింది. మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై, నాలుగో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై వరుసగా గెలుపొందింది. తర్వాత జరిగిన అయిదు, ఆరు, ఏడో మ్యాచ్‌ల్లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. మొత్తం ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేకేఆర్ మూడు మ్యాచుల్లో గెలవగా.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్‌కు ప్లస్ రన్ రేట్ (+0.160) ఉండడం ఒక సానుకూలాంశం. కేకేఆర్ శనివారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications