Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 టైటిల్ ఆ జట్టే గెలుస్తుంది.. ఎందుకంటే?: బ్రెట్‌ లీ

Brett Lee Picks Chennai Super Kings to Win IPL 2020 Title

దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 5 గంటల్లో ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కరోనా కారణంగా ఐపీఎల్ లీగ్ యూఏఈకి తరలినా.. దేశవ్యాప్తంగా మెగా టోర్నీపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. లీగ్ ఆరంభవుతుండంతో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను, విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఫేసర్ బ్రెట్‌ లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

చెన్నై టైటిల్ గెలుస్తుంది:

చెన్నై టైటిల్ గెలుస్తుంది:

ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సారి కూడా ట్రోఫీ దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని బ్రెట్‌ లీ జోస్యం చెప్పాడు. తాను చెన్నై వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నదీ విశ్లేషించాడు. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో బ్రెట్‌ లీ మాట్లాడుతూ... 'ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవనుంది. స్పిన్ విభాగంలో చెన్నై పటిష్టంగా ఉంది. ఇదే టోర్నీలో చెన్నైకి ప్లస్ పాయింట్ అవుతుంది. యూఏఈ వేదికలు స్పిన్ బౌలర్లకు కలిసి వస్తాయి. స్పిన్ అటాక్ కారణంగా చెన్నై ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలుస్తుంది' అని అన్నాడు.

యూఏఈ పిచ్‌లు కలిసివస్తాయి:

యూఏఈ పిచ్‌లు కలిసివస్తాయి:

'సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్ 2020కి దూరమయినా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చాలా మంది స్పిన్నర్లు ఉన్నారు. ఇమ్రాన్ తాహిర్‌, పీయూష్ చావ్లా, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కరణ్‌ శర్మ రూపంలో చక్కటి వనరులున్నాయి. జడేజా, సాంట్నర్ ఇద్దరూ బౌలింగ్, బ్యాటింగ్ చేయగలరు. జట్టులోని ప్రతిఒక్కరు వైవిధ్యమైన స్పిన్నర్లే. టోర్నీ జరుగుతున్నా కొద్ది వారిని అవగాహన వస్తుంది. యూఏఈ పిచ్‌లు వారికి కచ్చితంగా కలిసివస్తాయి' అని ఆస్ట్రేలియా దిగ్గజ ఫేసర్ బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.

ధోనీ సారధ్యం కొండంత బలం:

ధోనీ సారధ్యం కొండంత బలం:

జట్టులో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు లేకున్నా చెన్నై మిగిలిన జట్ల కంటే బలంగానే ఉందని బ్రెట్ ‌లీ అభిప్రాయపడ్డాడు. ఇక ఎంఎస్ ధోనీ సారధ్యం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ముంబై జట్టులో లసిత్ మలింగ లేని లోటును జస్ప్రీత్ బుమ్రా భర్తీ చేస్తాడని ఆయన ధీమా వ్యక్తంచేశాడు. బుమ్రాకు తాను ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చిన ‌లీ.. రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం ఉందని ప్రశంసించాడు. మ్యాచ్ చివరి ఓవర్లలో మంచి బౌలింగ్ చేయగల సామర్థ్యం బుమ్రాకు ఉందన్నాడు.

ముంబై ఆధిపత్యం:

ముంబై ఆధిపత్యం:

ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా.. చెన్నై 11 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుంది. మొత్తంగా ఐపీఎల్ టోర్నీలో చెన్నైపై ముంబై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక టైటిల్స్‌లో వేటలోనూ చెన్నై కంటే ముంబై ముందుంది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019లో టోర్నీ విజేతగా నిలవగా.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై 2010, 2011, 2018లో టైటిల్స్ గెలిచింది.

Story first published: Saturday, September 19, 2020, 14:43 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+