Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘సచిన్’ కోసం ఎదురుచూస్తున్నా: ‘అన్ఇండియన్’పై బ్రెట్ లీ

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ తెలిపాడు. సచిన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న 'సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

కాగా, జేమ్స్‌ ఎర్క్సిన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సచినే నటిస్తుండటం విశేషం. 'క్రికెటర్ల ప్రయాణం, వారి జీవితగాథలపై సినిమాలు రావడం చాలా ఆcvనందంగా ఉంది. సచిన్‌ జీవితకథ చూడడానికి ఆత్రుతగా ఉంది. అది నాకు బాగా నచ్చే అవకాశముంది. ఆయన చాలా గొప్ప ఆటగాడు, గొప్ప వ్యక్తి కూడా' అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో జీవిత చరిత్రల ఆధారంగా సినిమా పలు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మి ప్రధాన పాత్రలో మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ జీవిత చరిత్రపై రూపొందించిన 'అజహర్‌' సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో ధోనీ జీవితగాథపై 'ఎం ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

Brett Lee keen to watch Sachin Tendulkar biopic

ఇది ఇలా ఉండగా, ఆస్ట్రేలియన్‌ సినిమా అయిన 'అన్‌ఇండియన్‌' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు 39ఏళ్ల బ్రెట్‌లీ. అనుపమ్‌ శర్మ దర్శకత్వంలో వస్తున్న 'అన్‌ఇండియన్‌' ఆగస్టు 19న భారత్‌లో విడుదల కానుంది.

కాగా, ట్‌లీని తన బయోపిక్‌ గురించి ప్రశ్నించగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదనీ, కానీ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం 'అన్‌ఇండియన్‌'పైనే దృష్టిపెట్టినట్లు బ్రెట్ లీ తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+