బ్రెట్‌లీ బౌలింగ్.. చితకొట్టిన ఆరేళ్ల పాప (వీడియో)!!

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ 'బ్రెట్ లీ' గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కప్పుడు తన పేస్ బౌలింగ్‌తో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌లను కూడా వణికించాడు. 140 కిలోమీటర్లకు పైగా వచ్చే బ్రెట్‌లీ బంతులను ఎదుర్కొనేందుకు సచిన్, గంగూలీ, జయసూర్య, సంగక్కర, గేల్, ఫ్లెమింగ్, పీటర్ సన్, ఇంజమామ్, డెవిలియర్స్ లాంటి వారు కూడా తడబడేవారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఆరేళ్ల పాప మాత్రం భారీ షాట్లు ఆడి అలరించింది. అయితే బ్రెట్‌లీ తన సహజ బౌలింగ్ కాకుండా.. చిన్న పిల్లలకు వేసే విధంగా వేసాడు.

బ్రెట్‌లీ బౌలింగ్
విషయంలోకి వెళితే... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు 'టీ20 ప్రపంచకప్' తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో బ్రెట్ లీ బౌలింగ్ చేస్తుండగా.. ఆరేళ్ల తానీషా సేన్ అనే బాలిక బ్యాటింగ్ చేసింది. ఒక బంతిని స్ట్రైట్ డ్రైవ్ ఆడిన తానీషా.. తర్వాత బంతికి బ్రెట్ లీ చెప్పినట్లు పుల్‌షాట్ ఆడింది.

ఆరేళ్ల సచిన్‌ను చూశా
ఆరేళ్ల తానీషా కొట్టిన షాట్లకు మాజీ పేసర్ బ్రెట్ లీ ఫిదా అయ్యాడు. అక్కడే ఉన్న ఒక వ్యాఖ్యాత తానీషాని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని బ్రెట్ లీని అడగ్గా.. 'తానీషాని చూస్తుంటే.. ఆరేళ్ల సచిన్‌ను చూస్తున్నట్లు ఉంది' అని సమాధానం ఇచ్చాడు. ఆరేళ్ల పాప బ్యాటింగ్‌లో అదరగొడతోందని లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తానీషా ఆసీస్ తరఫున ఆడకపోవడానికి గల కారణాలేవీ తనకు కనిపించడం లేదన్నాడు.

మంధాన ఫేవరెట్
అదే వ్యాఖ్యాత తానీషాని 'నీ ఫేవరెట్ షాట్ ఏంటని అడిగితే.. కవర్ డ్రైవ్‌లు ఆడటమంటే ఇష్టమని' టక్కున చెప్పింది. ఇక భారత స్టార్ మహిళా ఓపెనర్ స్మృతి మంధాన తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా పేర్కొంది. ప్రస్తుతం తానీషా బ్యాటింగ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ఫాన్స్ ఆ చిన్నారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'బ్రెట్ లీ బౌలింగ్‌నే సునాయాసంగా ఆడుతున్నావ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తొలి టైటిల్ కోసం అమీతుమీ:
భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఆదివారం. ఎందుకంటే మహిళల టీ20 ప్రపంచక్‌పలో తొలి టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు మన జట్టు సిద్ధమవుతోంది. అంతేకాదు.. అదే రోజు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 31వ పడిలోకి అడుగుపెట్టనుంది. దీంతో తమ క్రికెట్ చరిత్రలోనే అద్భుత విజయంతో ఆ రోజును చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications