హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధిస్తుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బ్రెట్ లీ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా బ్రెట్ లీ మీడియాతో మాట్లాడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
గత కొంతకాలంగా భారత జట్టు ఆటతీరుని చూసి ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అటు బ్యాటింగ్ ఇటు ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోందని బ్రెట్ లీ అన్నాడు. టీమిండియా గత కొంతకాలంగా మంచి క్రికెట్ ఆడుతుందని కితాబిచ్చాడు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచే అవకాశముందని చెప్పాడు. 'చాలా కాలంగా భారత క్రికెట్ మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇప్పుడు ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ల్లో సమతుల్యతను కలిగి ఉంది. మంచి క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్ ను చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నా' అని బ్రెట్ లీ అన్నాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచే అవకాశాలు భారత్‌కే ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా టైటిల్‌ను సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నాడు. పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్ గొప్ప విజయం సాధించిందని, సరైన సమయంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి పాక్‌పై పైచేయి సాధించిందని చెప్పాడు.
పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయం నిజంగా అద్భుతమని, అదొక పరిపూర్ణ విజయంగా బ్రెట్ లీ అభివర్ణించాడు. గ్రూప్ ఎలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవల్చి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.
లీగ్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా... ఇంగ్లాండ్‌పై విజయం సాధిస్తే సెమీస్‌కి అర్హత సాధిస్తుందని, రెండున్నర వారాల్లో ముగిసే ఛాంపియన్స్ ట్రోఫీ అంటే తనకి ఎంతో ఇష్టమని బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు.