అక్లాండ్: సెమీ ఫైనల్లో భాగంగా దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ జట్లు మంగళవారం తలపడుతున్నాయి. సొంత గడ్డ పైన ఆడుతున్న కివీస్ అభిమానుల మద్దతును కోరింది. అభిమానులు స్టేడియానికి తరలి రావాలని, ఆఫీసులకు సగం రోజైనా సెలవు ఇవ్వాలని కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పత్రికల ద్వారా కోరాడు.
అభిమానులు కార్యాలయాలలో కాకుండా ఈడెన్ పార్క్‌కు వచ్చి మద్దతు ఇవ్వాలనికోరాడు. కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని కోరాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ని చూసేందుకు వచ్చి, జట్టుకు మద్దతు ప్రకటించాలని అన్ని కార్యాలయాలకు అతను స్వయంగా లేఖ రాశాడు కూడా. పత్రికల ద్వారా ప్రకటన ఇచ్చాడు.

ఒక సీటు, జాతీయ పతాకం మీ కోసం సిద్ధంగా ఉన్నాయని తన లేఖలో పేర్కొన్నాడు. తమ అభిమాన క్రికెటర్, జట్టు కెప్టెన్ లేఖ రాయడంతో ఉద్యోగులు తెగ సంబరపడుతున్నాడు. మంగళవారం నాటి మ్యాచ్‌కి భారీగా తెరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కి గణాంకాలు ముఖ్యం కాదని మెక్‌కలమ్ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాతో ఆరు మ్యాచ్‌లు ఆడిన కివీస్ నాలుగు విజయాలు సాధించి, ఆధిక్యంలో ఉంది. అయితే, చరిత్ర కంటే మ్యాచ్‌లో ఏ విధంగా రాణిస్తామన్నదే ముఖ్యమని మెక్‌కలమ్ అన్నాడు. మార్టిన్ గప్టిల్ మళ్లీ ఫామ్‌లోకి రావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నదని చెప్పాడు.