For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీ: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మెక్‌కల్లమ్

By Nageswara Rao

క్రైస్ట్ చర్చ్: కెరీర్‌లో తన చిట్టచివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ అరుదైన రికార్డుని తిరగరాశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. 54 బంతుల్లో 100 పరుగులు చేసి 34 ఏళ్ల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డుని బద్దలు కొట్టాడు.

క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మెక్‌కల్లమ్ ఈ ఘనత సాధించాడు. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. లంచ్ విరామసమయానికి న్యూజిలాండ్ స్కోరు 32/3. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన మెక్‌కల్లమ్ కంగారూలపై విశ్వరూపం ప్రదర్శించాడు.

తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే 21 పరుగులు సాధించి షాన్ మార్ష్‌కు చుక్కలుచూపాడు. మెక్‌కల్లమ్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అంపైర్ లంచ్ విరామం ప్రకటించాడు. ఆట మొదలైన తర్వాత మెక్‌కల్లమ్ విశ్వరూపం దెబ్బకు ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

Brendon McCullum hits fastest century in Test history in his final match

54 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేసిన మెక్‌‌కల్లమ్.... టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 1986లో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఇంగ్లాండ్‌పై 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 2014లో పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బాఉల్ హక్ ఆస్ట్రేలియాపై 56 పరుగుల్లోనే 100 పరుగులు చేశారు.

టెస్టుల్లో మెక్‌కల్లమ్‌కు 12వ సెంచరీకాగా, బ్యాటింగ్‌లో అత్యధిక సిక్సులు(100) కొట్టిన వికెట్ కీపర్‌గా మెక్‌కల్లమ్.. ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 145 పరుగులు చేసిన మెకల్లమ్ ఆరోవికెట్‌గా వెనుదిరిగాడు.

రికార్డు కంటే గెలుపే ముఖ్యం: మెక్‌కల్లమ్

టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేసిన విషయం క్రీజులో ఉన్నప్పుడు తెలియదని న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్సష్టం చేశాడు. తాను క్రీజులోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ బంతిని బౌండరీ దాటించే ప్రయత్నం మాత్రమే చేశానన్నాడు.

అయితే అది ఇలా రికార్డుగా నమోదు అవుతుందని తాను ఊహించలేదని తెలిపాడు. ఇన్నింగ్స్ అనంతరం మెక్ కల్లమ్ మాట్లాడుతూ చివరి మ్యాచ్ కావడంతో బ్యాట్‌తో పరుగులు సాధించాలని మాత్రమే ప్రయత్నించానన్నాడు. ఆ క్రమంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగి ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం చేశానన్నాడు.

తనకెంతో ఇష్టమైన క్రికెటర్ వివ్ రిచర్డ్స్ రికార్డును అధిగమించడం చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ రికార్డు కంటే మ్యాచ్‌లో గెలుపే ముఖ్యమని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+