Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేలంలో అమ్ముడుపోలేదు: రిటైర్మెంట్ యోచనలో బ్రెండన్ మెక్‌కల్లమ్

Brendon McCullum hints at retirement after going unsold in IPL 2019 auction

హైదరాబాద్: గత మంగళవారంతో ముగిసిన ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.

70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి. అయితే, ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు కోట్లు పలకగా, మరికొందరిపై ప్రాంఛైజీలు ఆసక్తిని కనబర్చలేదు.

 బ్రెండన్ మెక్‌కల్లమ్ మాట్లాడుతూ

బ్రెండన్ మెక్‌కల్లమ్ మాట్లాడుతూ

అలాంటి ఆటగాళ్లలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌‌కల్లమ్ ఒకడు. అయితే, వేలంలో తనను ఏ ప్రాంచైజీ కోనుగోలు చేయకపోవడంపై బ్రెండన్ మెక్‌కల్లమ్ మాట్లాడుతూ "నేను 11 ఐపీఎల్‌ సీజన్లు ఆడాను. అందుకు నేనెంతో అదృష్టవంతుడిని. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకానొక సమయంలో ఆటకు దూరం కావాల్సి రావొచ్చు" అని అన్నాడు.

చివరికి మంచే జరుగుతుంది

చివరికి మంచే జరుగుతుంది

"ఏం జరిగినా చివరికి మంచే జరుగుతుంది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కొంతమంది ఐపీఎల్‌లో ఆడుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఆడలేకపోతున్నందుకు బాధపడటం లేదు. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. అన్నింటినీ స్వీకరించాలి. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఎప్పుడు ఏం జరుగుతుందో మీరు, నేను ఎవరూ అంచనా వేయలేరు. ఏం జరిగిన మన మంచికే అని తెలుసుకోవాలి" అని మెక్‌కల్లమ్ అన్నాడు.

ఐపీఎల్ తొలి సీజన్‌లో మెక్‌కల్లమ్ సెంచరీ

ఐపీఎల్ తొలి సీజన్‌లో మెక్‌కల్లమ్ సెంచరీ

మెక్‌కల్లమ్ ఐపీఎల్ తొలి సీజన్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 158 సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన క్రికెటర్ కూడా మెక్‌కల్లమ్ అరుదైన ఘనత సాధించాడు. అలాంటి ఆరుదైన సొంతం చేసుకున్నప్పటికీ, మెక్‌కల్లమ్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు.

కెప్టెన్‌గా కూడా మెక్‌కల్లమ్ ఎన్నో విజయాలు

కెప్టెన్‌గా కూడా మెక్‌కల్లమ్ ఎన్నో విజయాలు

ఇక, న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌గా కూడా మెక్‌కల్లమ్ ఎన్నో విజయాలు అందించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడాడు. మెక్‌కల్లమ్ ఇప్పటి వరకు 109 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 27.70 యావరేజితో 2,881 పరుగులు చేశాడు.

Story first published: Friday, December 21, 2018, 19:23 [IST]
Other articles published on Dec 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+