'డోపింగ్ నుంచి బయటపడేందుకు బీసీసీఐ సహకరించింది'

హైదరాబాద్: డోపింగ్‌కు పాల్పడినట్లు ఆలస్యంగా బయటపడ్డాడు న్యూజిలాండ్ ఆటగాడు. ఈ విషయాన్ని మెకల్లమ్ స్వయంగా వెల్లడించాడు. అయితే అతను తాను వాడిన ఉత్ప్రేరకం విషయంలో మినహాయింపు ఉన్నట్లుగా ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం తప్పించుకున్నట్లు స్పష్టం చేశాడు. 2016లో భారత్‌లో ఒక ప్రముఖ ఆటగాడు డోప్ పరీక్షలో విఫలమైనట్లుగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పేర్కొంది.
అయితే అతను ఎవరన్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్పట్లో దాచి పెట్టింది. అదే ఏడాది సాంగ్వాన్, యూసుఫ్ పఠాన్, అభిషేక్ గుప్తా దేశవాళీ మ్యాచ్‌ల సందర్భంగా డోప్ పరీక్షల్లో విఫలమైనట్లు మాత్రం బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ఇప్పుడు మెక్‌కలమే స్వయంగా తాను డోపీగా దొరికిన విషయాన్ని పేర్కొన్నాడు.
'ఆ సమయంలో ఇన్‌హేలర్ అతిగా వాడాను. బీసీసీఐ నాకు సహకరించింది' అని మెక్‌కలమ్ తెలిపాడు. రెండేళ్ల క్రితం గుజరాత్ లయన్స్ తరపున ఆడినప్పుడు ఆస్తమా బాధితుడైన మెకల్లమ్ ఢిల్లీలో కాలుష్యం వల్ల బాగా ఇబ్బంది పడటంతో ఎప్పుడూ వాడే ఇన్‌హేలర్ మందు ఎక్కువ స్థాయిలో తీసుకున్నాడట. దీని ఫలితంగా డోప్ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడట.
దీనిపై బీసీసీఐ అతడిని వివరణ కోరగా.. స్వీడన్‌కు చెందిన వైద్య నిపుణుల నుంచి ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం నుంచి బయటపడినట్లు వెల్లడైంది. ఐతే ఇప్పుడు మెక్‌కలమ్ స్వయంగా తాను డోపీగా తేలడం గురించి వెల్లడించాడు. ఆస్తమా బాధితుడైన మెక్‌కలమ్ ఢిల్లీలో కాలుష్యం వల్ల బాగా ఇబ్బంది పడటంతో తాను ఎప్పుడూ వాడే ఇన్‌హేలర్ మందు ఎక్కువ స్థాయిలో తీసుకున్నాడట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications