హామిల్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ మరో అరుదైన రికార్డును సాధించాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి వరుసగా అత్యధిక మ్యాచ్‌లు(98) ఆడిన దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును మెక్‌కలమ్ అధిగమించాడు.
తాజాగా, మెక్కల్లమ్ కెరీర్లో 99వ టెస్టు మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడుతున్నాడు. ప్రస్తుతం హామిల్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కలమ్ శ్రీలంక జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
కాగా, మెక్కల్లమ్, డివిలియర్స్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. అతడు 96 వరుస టెస్ట్ మ్యాచులు ఆడాడు.
ఇది ఇలా ఉండగా, శ్రీలంక తొలి రోజు టెస్టు మ్యాచులో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రెండో రోజు 63, 0 పరుగులతో శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్, చమీరా క్రీజులో ఉన్నారు. టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్ చెరో 2 వికెట్లు, బ్రెస్ వెల్ ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, రెండు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్ 1.0తో లీడ్‌లో ఉంది.