సమయం ఆసన్నమైంది: వీడ్కోలు పలికిన మెక్‌కల్లమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో ఆసీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరిస్ అనంతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని మంగళవారం ప్రకటించాడు.
న్యూజిలాండ్ జట్టు తరుపున 100 వరుస టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్ మెక్ కల్లమ్ కావడం విశేషం. 34 ఏళ్ల మెక్‌కల్లమ్ ఫిబ్రవరి 20వ తేదీన హేగ్లే ఓవల్ స్టేడియంలో తన 101 టెస్టు మ్యాచ్‌ను ఆడనున్నాడు. గత రెండేళ్లుగా కివీస్‌ను విజయపథంలో మెక్‌కల్లమ్ నడిపిస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్ అధ్బుతమైన ఆటగాళ్లలో ఒకడైన మెక్‌కల్లమ్ తన తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న ట్వంటీ20 వరల్డ్ కప్‌ను మిస్ అవనున్నాడు. 'ఆటగాడిగా, కెప్టెన్ నాకు ఇచ్చిన అవకాశాలను ఎంతో ప్రేమించా. ఆటకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సొంత దేశం తరపు ఆడడం మర్చిపోలేని అనుభవం' అని మెక్ కల్లమ్ అన్నాడు.

కెరీర్‌లో
ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన మెక్‌కల్లమ్ 38.48 సగటుతో 6,273 పరుగులు సాధించాడు. స్టీఫెన్ ప్లెమింగ్ (7,172 పరుగులు) తర్వాత న్యూజిలాండ్ జట్టు తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. గతేడాది వెల్లింగ్టన్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ (302) సాధించాడు.
న్యూజిలాండ్ జట్టు తరుపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు మెక్‌కల్లమ్ కావడం విశేషం. 2013లో మూడు ఫార్మాట్లకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. మెక్‌కల్లమ్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలను సాధించిన న్యూజిలాండ్ గతేడాది వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది. మెక్‌కల్లమ్ వారసుడిగా 25 ఏళ్ల కానే విలియమ్సన్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications