Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో 20 జట్ల తరపున ఆడిన బ్రావో..

Bravo has a shirt for every over

హైదరాబాద్: ఎప్పుడూ మైదానంలో చురుగ్గా కదులుతూ.. బ్యాటింగ్‌లోనూ..బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్న సీనియర్ క్రికెటర్ డేన్ బ్రావో.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు అతనిది. మైదానంలో ఆటతోనే కాకుండా.. మైదానం బయట కూడా ఆటపాటలతో అలరించే అసలైన ఆల్‌రౌండర్‌ బ్రావో. టి20 క్రికెట్‌ స్టార్లలో ఒకడైన అతనికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్‌ ఉంది.

ప్రతీ జట్టూ తమకు బ్రావోలాంటి ఆటగాడు ఉండాలని కోరుకుంటుదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల క్రితమే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతను, బోర్డుతో గొడవల కారణంగా 2014లోనే వన్డేలకు దూరమయ్యాడు. రెండు టి20 వరల్డ్‌ కప్‌లు నెగ్గిన జట్టులో సభ్యుడైన బ్రావో.. ఎక్కడ టీ20 మ్యాచ్‌లు జరిగినా అక్కడ ఉండి తీరతాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రావో.. తాజాగా ఇంగ్లాండ్ కౌంటీ మిడిలెసెక్స్‌ తరఫున బరిలోకి దిగాడు.

దీంతో కలిపి అతను టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన జట్ల సంఖ్య సరిగ్గా 20కు చేరడం విశేషం. పది రోజుల క్రితం వరకు అతను ఆడిన జట్ల సంఖ్య 18 ఉండగా, దానికి అదనంగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. 'ఒక్కో ఓవర్‌కు ఒక్కో టీమ్‌ చొప్పున నా దగ్గర వేర్వేరు 20-20 జెర్సీలు ఉన్నాయి' అని అతను సరదాగా వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 394 టి20లు ఆడిన బ్రేవో 5,685 పరుగులు చేయడంతో పాటు 430 వికెట్లు పడగొట్టాడు.

బ్రావో ఆడిన టి20 జట్లు
1. వెస్టిండీస్, 2. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, 3. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, 4.ఎసెక్స్, 5. కెంట్, 6. సర్రే, 7. మిడిలెసెక్స్, 8. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్, 9. సిడ్నీ సిక్సర్స్, 10. విక్టోరియా, 11. చెన్నై సూపర్‌ కింగ్స్, 12. ముంబై ఇండియన్స్, 13. గుజరాత్‌ లయన్స్, 14. చిట్టగాంగ్‌ కింగ్స్, 15. కొమిల్లా విక్టోరియన్స్, 16. ఢాకా డైనమైట్స్, 17. లాహోర్‌ ఖలందర్స్, 18. పెషావర్‌ జల్మీ, 19. డాల్ఫిన్స్, 20. విన్నిపెగ్‌ హాకింగ్స్‌.

Story first published: Tuesday, July 10, 2018, 11:39 [IST]
Other articles published on Jul 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+