Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డక్‌వర్తలూయిస్: భారత్ ఓటమి, క్రీడాస్ఫూర్తి చాటని బ్రాత్‌వైట్

ఫ్లోరిడా: అమెరికాలో వాన కారణంగా భారత్ - వెస్టిండీస్ మధ్య రద్దైన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌ను రద్దు చేయవద్దని, ఆట ఆడుదామని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ చేసిన వినతిని విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ తోసిపుచ్చాడు. మ్యాచ్ రద్దు కావడంపై ధోనీ అసహనానికి గురైన విషయం తెలిసిందే.

భారత్ ఆశలపై వర్షం నీళ్లు, ట్వంటీ 20 సిరీస్ విండీస్ వశం: ఒక్కరోజులో..

తొలి ట్వంటీ 20ని విండీస్ ఒక్క పరుగు తేడాతో గెలుచుకుంది. రెండో ట్వంటీ 20లో భారత్ మంచి ఊపు మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటను రద్దు చేయడం లేదా కొనసాగించడం ఎంపైర్ల నిర్ణయం.

మ్యాచ్ ఆడుదామని ధోనీ చెప్పినప్పటికీ విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ మాత్రం నో చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అతను నేరుగా చెప్పకుండా.. తమ ఆటగాళ్లకు గాయాలవుతాయని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో అంపైర్లు మ్యాచును రద్దు చేశారు.

Brathwaite says outfield was unsafe

వాస్తవానికి 144 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వాన ప్రారంభం కాకముందే రెండు ఓవర్లలో 15 పరుగులు చేసింది. డక్ వర్తలూయిస్ పద్ధతి ప్రకారం చూసుకుంటే ఐదు ఓవర్లలో భారత్ 28 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచినట్లవుతుంది.

దీంతో ఇంకో ఓవర్ ఆడినా భారత్ గెలుస్తుందనే ఉద్దేశ్యంతో కావాలనే బ్రాత్ వైట్ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించాడు. బ్రాత్ వైట్ క్రీడాస్ఫూర్తి చూపించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ ఐదు ఓవర్లు ఆడి ఉండి, గెలిస్తే సిరీస్ సమం అయ్యేది.

కాగా, మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ... వెస్టిండీస్‌తో రెండో టీ20కి వర్షం ఇబ్బంది కలిగించినా ఆ తర్వాత మ్యాచ్‌ ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని అయినా ఆట కొనసాగించలేకపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు.

వర్షం తర్వాత మైదానంలో పరిస్థితులు ఆటకు అనుకూలంగా లేవని అంపైర్లు తమతో చెప్పారని, తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు ఆడానని, 2011 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇంతకంటే దారుణమైన స్థితిలో ఆడాల్సి వచ్చిందని, కొన్ని మ్యాచ్‌లు వర్షంలోనే ఆడామని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+