Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20లకు హిట్టర్లను బరిలోకి దింపనున్న వెస్టిండీస్

Brathwaite, Pollard Sweat It out at Eden Gardens

హైదరాబాద్: భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ల్లో విఫలమైన వెస్టిండీస్ జట్టు.. తమకి అచ్చొచ్చిన టీ20ల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్, వెస్టిండీస్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆ జట్టు హిట్టర్లు ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు.

భారత్ చేతిలో ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ 1-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో.. కనీసం ఈ మూడు టీ20ల సిరీస్‌లోనైనా గెలవాలని కరీబియన్ జట్టు ఆశిస్తోంది.

టెస్టు, వన్డే జట్టులో లేని కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, దినేశ్ రామ్‌దిన్, పొలార్డ్ తదితరులు గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కువగా హిట్టింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో ఈ వేదికగానే వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బ్రాత్‌వైట్ గురువారం దాదాపు మూడు గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడట. మరోవైపు ఏడాది తర్వాత మళ్లీ వెస్టిండీస్ టీ20 జట్టులో బ్రావో, పొలార్డ్ ఆడుతున్నారు.

గురువారం సాయంత్రానికే వెస్టిండీస్-భారత్‌ల టీ20 మ్యాచ్ 18వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.
టీ20లకు ఆడనున్న వెస్టిండీస్ జట్టు: కార్లొస్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫాబియనె అల్లెన్, డారెన్ బ్రావో, షిమ్రెన్ హేట్‌మెయర్, ఎవిన్ లూయీస్, మెకొకొయ్, ఆశ్లీ నర్స్, కీమో పాల్, ఖారీ ఫిర్రె, కీరన్ పొలార్డ్, రొమన్ పొవెల్, దానేశ్ రాందిన్, ఆండ్రీ రస్సెల్, షెర్పాన్ రూథర్ ఫర్డ్, ఒషాన్ థామస్.

Story first published: Friday, November 2, 2018, 16:30 [IST]
Other articles published on Nov 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+