Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రెయిన్ ఫేడ్ 2: డీఆర్‌ఎస్‌ వివాదంలో లంక క్రికెటర్, అసలేం జరిగింది?

Dilruwan Perera does a Steve Smith as DRS row flares up again

హైదరాబాద్: ఏడు నెలల కిందట ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన నిర్వాకం గుర్తుందా? డీఆర్‌ఎస్ విషయంలో స్టీవ్ స్మిత్ పదేపదే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం.. వాళ్ల సూచనల మేరకు డీఆర్‌ఎస్ తీసుకోవాలా వద్దా అని నిర్ణయించడం అప్పట్లో పెను సంచలనమే అయింది.

తాజాగా అలాంటి సంఘటనే కోల్‌కతా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో చోటు చేసుకుంది. ఈడెన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక క్రికెటర్ దిల్రువాన్‌ పెరీరా ఆలస్యంగా రివ్యూ కోరాడు. ఈ సంఘటన ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ సంఘటనను తలపించింది.

షమీ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్‌ చివరి బంతికి పెరీరాను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. నాన్‌స్ట్రైకర్‌ వైపు ఉన్న రంగనా హెరాత్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సైలెంట్‌గా వెనుదిరిగిన అతడు.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి సిగ్నల్ అందుకొని రివ్యూ కోరాడు.

అంపైర్ మూడో అంపైర్‌కు అప్పీల్ చేయడం.. రిప్లేల్లో అది నాటౌట్‌గా తేలడంతో అతను బతికిపోయాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా శ్రీలంక ఇలా వ్యవహరించడం మరోసారి వివాదాస్పదమైంది. కొద్దిసేపటి తర్వాత రిప్లే చూసిన కామెంటేటర్లు.. శ్రీలంక ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం నుంచి పెరీరాను రివ్యూ కోరమని సైగ చేసినట్లు గుర్తించారు.

అదే రిప్లేలో కూడా కనిపించింది. ఈ సన్నివేశం చూసిన వెంటనే న్యూజిలాండ్‌ కామెంటేటర్‌ సైమన్‌ డల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పదే పదే ప్రదర్శించిన వీడియో రిప్లేలో శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్ నుంచి చేతులు ఊపుతూ సిగ్నల్స్ వచ్చినట్టు కనిపించింది. దీంతో వెంటనే పెరీరా వెనక్కి తిరిగి సమీక్ష కోరాడు.

నిజానికి డీఆర్‌ఎస్ నిబంధనల మేరకు క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే డీఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకోవాలి. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎలాంటి సూచనలు ఇవ్వడానికి వీల్లేదు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టించుకోకపోవడంతో అంపైర్లు రివ్యూ స్వీకరించారు.

ఒకవేళ కోహ్లీ అభ్యంతరం తెలిపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే కామెంటేటర్లు హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఇదిలా ఉంటే దిల్రువాన్‌ చర్యను ట్విటర్‌ వేదికగా క్రికెట్‌ విశ్లేషకులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

Story first published: Sunday, November 19, 2017, 21:59 [IST]
Other articles published on Nov 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+