For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌ కంటే కోహ్లీనే నిలకడైన ఆటగాడు: బ్రాడ్‌ హాగ్‌

Brad Hogg says Cannot compare Rohit Sharma, Virat Kohli

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌ల మధ్య పోలిక లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా భారీ టార్గెట్లను టీమిండియా చేజింగ్‌ చేసేటప్పుడు ఎవరు ఎక్కువ నిలకడగా ఆడతారు అనే దానిపై ఈ మాజీ స్పిన్నర్ వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో రోహిత్‌ కంటే కోహ్లినే ఎంతో నిలకడైన ఆటగాడని హాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్‌ బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు మాజీ క్రికెటర్లు. ఇద్దరి బ్యాటింగ్‌ను పోలుస్తూ ఎవరు గొప్ప అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది.

కోహ్లీనే ఉత్తమం:

కోహ్లీనే ఉత్తమం:

తన యూట్యూబ్ ఛానెల్‌లో బ్రాడ్ హాగ్ అభిమానులతో ముచ్చటించాడు. అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన హాగ్‌కు కోహ్లీ-రోహిత్‌ల్లో ఎవరు ఉత్తమం అనే ప్రశ్న ఎదురైంది. ప్రత్యేకంగా వైట్‌బాల్‌ క్రికెట్ ‌(పరిమిత ఓవర్ల క్రికెట్)లో ఎవరు మంచి ఆటగాడని అనుకుంటున్నారు అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన వీడియోను తన అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లో హాగ్‌ పోస్ట్‌ చేశాడు. రోహిత్‌ కంటే కోహ్లీనే ఉత్తమం అని హాగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కోహ్లీనే నిలకడైన ఆటగాడు:

కోహ్లీనే నిలకడైన ఆటగాడు:

'భారత్ భారీ స్కోర్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అత్యంత స్థిరంగా బ్యాటింగ్ చేస్తాడు. అతను పటిష్టంగా నిలబడి మ్యాచ్‌ను గెలిపిస్తాడు. విరాట్‌ని, రోహిత్‌ని పోల్చలేం. ఎందుకంటే.. వారిద్దరి పాత్రలు వేరు. కొత్త బంతి బౌలర్ల బౌలింగ్‌లో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటం రోహిత్ పాత్ర. మరోవైపు మ్యాచ్ ఆసాంతం నిలబడి మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడమే కోహ్లీ పాత్ర. కచ్చితంగా కోహ్లీనే నిలకడైన ఆటగాడు' అని హాగ్ తెలిపాడు.

అశ్విన్‌ గొప్ప ఆఫ్ స్పిన్నర్ కానీ:

అశ్విన్‌ గొప్ప ఆఫ్ స్పిన్నర్ కానీ:

టెస్టు ఫార్మాట్​లో టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ గొప్ప ఆఫ్ స్పిన్నర్‌ అని, అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ అత్యుత్తమని బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. 'ప్రస్తుతం ప్రపంచ బెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ లైయన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన ఏడాది వరకూ బెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రేసులో అశ్విన్‌ ముందు వరుసలో ఉండేవాడు. ఆ ప్లేస్‌ను అశ్విన్‌ నుంచి లైయన్‌ లాగేసుకున్నాడు. అయితే ఇద్దరూ గొప్ప స్పిన్నర్లే. తమ ఆటతీరుపై సంతృప్తి చెందకుండా బౌలింగ్‌లో మరింత మెరుగువ్వాలని ప్రయత్నిస్తుంటారు' అని చెప్పాడు.

Story first published: Thursday, June 4, 2020, 19:30 [IST]
Other articles published on Jun 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+