Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టు.. ఏడుగురు భారత ఆగాళ్లకు చోటు.. కెప్టెన్ ధోనీ, రోహిత్ కాదు!!

Brad Hoggs all-time IPL XI; Virat Kohli captains the side

సిడ్నీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆస్ట‌న్ అగ‌ర్, దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్, శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ ప్ర‌పంచ అత్యుత్త‌మ క్రికెట్ జ‌ట్టును ప్రకటించగా.. తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు.

రైనా, మలింగలను విస్మరించాడు:

రైనా, మలింగలను విస్మరించాడు:

బ్రాడ్ హాగ్ ఐపీఎల్‌లోని అన్ని జట్ల నుంచి తనకు నచ్చిన వారందరినీ కలిపి కలల జట్టును ఆదివారం ప్రకటించాడు. అయితే తన జట్టులో ఏకంగా ఏడుగురు భారత ఆగాళ్లకు చోటు కల్పించాడు. తన జాతీయ జట్టు నుండి మాత్రం డేవిడ్ వార్నర్‌కు అవకాశం ఇచ్చాడు. అయితే బ్రాడ్ హాగ్ తన జట్టులో కొందరికి చోటివ్వకపోవడం ఆశ్చర్యంగా ఉంది. టోర్నీ స్టార్ ఆటగాళ్లు సురేష్ రైనా, లసిత్ మలింగలను అతడు విస్మరించాడు. రైనా ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌. 193 మ్యాచ్‌లలో 5,368 పరుగులు చేసాడు. మలింగ ఈరోజు వరకు అత్యధిక వికెట్లు (170 వికెట్లు-122 మ్యాచ్‌లు) సాధించిన బౌలర్.

కెప్టెన్‌గా కోహ్లీ:

కెప్టెన్‌గా కోహ్లీ:

బ్రాడ్ హాగ్ తన ఆల్ టైం ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ టీంకు మూడు టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోనీలను కాదని కోహ్లీని ఎంచుకోవడం విశేషం. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు సారధిగా ఉన్న కోహ్లీ.. ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవలేదు.

 ఓపెనర్లుగా రోహిత్, వార్నర్:

ఓపెనర్లుగా రోహిత్, వార్నర్:

బ్రాడ్ హాగ్ తన ఆల్ టైం ఐపీఎల్‌ జట్టులో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ఏబీ డివిల్లీర్స్, ఎంఎస్ ధోనీలను ఎంచుకున్నాడు. ఇక స్పిన్ విభాగంలో సునీల్ నరైన్, రషీద్ ఖాన్.. పేస్ విభాగంలో మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను తీసుకున్నాడు. మునాఫ్ పటేల్‌ను జట్టులో చేర్చుకోవడం హాగ్ తీసుకున్న మరో ఆశ్చర్యకరమైన నిర్ణయం.

బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టు:

బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టు:

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ఏబీ డివిల్లీర్స్, ఎంఎస్ ధోనీ, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Monday, May 11, 2020, 10:21 [IST]
Other articles published on May 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+