
హాగ్ షాకింగ్ కామెంట్స్:
తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. కోహ్లీ లేని సమయంలో భారత జట్టుకు కెప్టెన్‌ను ఎవరిని చేయాలనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో క్రికెట్ నిపుణులు ఎవరి అభిప్రాయాలు వారు చెపుతున్నారు. భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించడంతో కెప్టెన్సీ పగ్గాలు అతనికే ఇవ్వాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో రోహిత్ కేవలం టీ20 ఫార్మాట్‌లోనే సక్సెస్ అవుతున్నాడని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఓ అడుగు ముందుకేసి.. రోహిత్ కెప్టెన్సీకి పనికిరాడంటూ ట్విటర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్‌కు కెప్టెన్సీ ఎలా అప్పగిస్తారు:
విదేశాల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు సరిగా రాణించింది లేదని, బ్యాటింగ్‌లోనే సరిగా రాణించని వ్యక్తికి కెప్టెన్సీ ఎలా అప్పగిస్తారంటూ బ్రాడ్ హాగ్ ప్రశ్నించాడు. రోహిత్‌తో కంటే టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే చక్కగా ఆడగలడని, అతడికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. 'రోహిత్ ఇటీవల జరిగిన టెస్టుల్లో గొప్పగా రాణించాడు. కానీ అదంతా స్వదేశంలో. ఇప్పుడు ఆడబోతోంది ఆస్ట్రేలియాలో. రోహిత్‌కు ఇప్పటివరకు విదేశాల్లో జరిగిన టెస్టుల్లో అంతగా రాణించలేదు. జట్టులో అతడు స్థానం నిలబెట్టుకోవడమే కష్టం, అలాంటి వ్యక్తికి కెప్టెన్సీ ఎలా ఇస్తారు' అని ప్రశ్నించాడు.

రహనేకు బాధ్యతలు అప్పగించాలి:
'రోహిత్ శర్మ కంటే అజింక్య రహనేకు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుంది. అతడు జట్టును చక్కగా నడిపించగలడు. దీనివల్ల రోహిత్ కూడా కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి సారించగలుగుతాడు. ఆస్ట్రేలియా టూర్ వంటి ప్రతిష్ఠాత్మక సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గైర్హాజరవడం భారత జట్టుకు కొంత ఇబ్బందే. అయితే విరాట్ లేని లోటు రోహిత్‌తో తీరే అవకాశం లేదు' అని ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. హాగ్ ఆసీస్ తరఫున 7 టెస్టులు, 123 వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

తండ్రి కాబోతున్న విరాట్:
విరాట్ కోహ్లీ తొలి టెస్టు మాత్రమే ఆడి.. ఆ తరువాత భారత్ చేరుకోనున్నాడు. తొలిసారిగా తండ్రి కాబోతున్న విరాట్.. తన భార్య అనుష్క శర్మ డెలివరీ సమయంలో తోడుగా ఉండేందుకే తిరిగి భారత్ రానున్నాడు. దీంతో మిగతా టెస్టు మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సారథిగా వ్యవహరించనున్నాడు. డిసెంబర్ 17 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 2018-19లో కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను 2-1తో కోహ్లీసేన చిత్తు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












