Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: చెన్నైకి షాక్.. ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ లిస్టులో ఆ మూడు జట్లు!!

Brad Hogg Names RCB, MI, KKR his Favourites teams to Win IPL 2020 in UAE
IPL 2020 : Brad Hogg Names His Favourites For IPL 2020 Title || Oneindia Telugu

దుబాయ్: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక మెగా టోర్నీ ఆరంభానికి ఇంకా 16 రోజులు మాత్రమే ఉండడంతో అప్పుడే టైటిల్ ఫేవరెట్స్‌ గురించి చర్చ మొదలైపోయింది.

టైటిల్ ఫేవరెట్ లిస్టులో బెంగళూరు:

టైటిల్ ఫేవరెట్ లిస్టులో బెంగళూరు:

భారత్‌లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ 2020 యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. యూఏఈ పిచ్‌లు దాదాపు భారత్‌లో మాదిరిగానే ఉన్నా.. అధిక ఉష్ణోగ్రత కారణంగా కొంచెం భిన్నంగా ఉంటాయి. దీంతో ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ రేసులోకి ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్‌ని తాజాగా ఓ అభిమాని ఐపీఎల్ 2020 సీజన్ విజేతగా ఎవరు నిలిచే అవకాశం ఉందని అడిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల పేర్లను సదరు అభిమానికి చెప్పాడు.

చెన్నైకి షాక్:

చెన్నైకి షాక్:

ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని మాజీ కేకేఆర్ స్పిన్నర్ బ్రాడ్ హగ్ విస్మరించడం అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు లీగ్ ఆరంభం నుండి ఏ సీజన్లో కూడా నిరాశపరచలేదు. ప్రతిసారి ప్లే ఆఫ్ చేరుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నుంచి స్టార్ ఆటగాడు సురేశ్ రైనా వైదొలిగలడం, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇంకా జట్టులో చేరకపోవడం లాంటి విషయాలను బ్రాడ్ హగ్ పరిగణలోకి తీసుకుని ఉండవచ్చు.

ముంబై నాలుగు సార్లు:

ముంబై నాలుగు సార్లు:

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. ముంబై ఇండియన్స్ అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ సాధించగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు చేజిక్కించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, దక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలో ఒక్కోసారి విజేతగా నిలిచాయి. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై, గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్‌కతాలు కప్పులు అందుకున్నాయి.

 ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు:

ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు:

ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్ గేల్, డేల్ ‌స్టెయిన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అయినా ఆర్సీబీ అభిమానులు ఆ జట్టుకు అండగా ఉండడం విశేషం.

నికోలస్ పూరన్ జట్టులో ఉన్నా.. కేఎల్ రాహులే మా వికెట్‌కీపర్‌: కుంబ్లే

https://telugu.mykhel.com/cricket/he-knows-the-team-better-than-me-anil-kumble-opens-up-on-kl-rahul-s-capabilities-ahead-of-ipl-2020-030073.html

Story first published: Thursday, September 3, 2020, 16:32 [IST]
Other articles published on Sep 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+