సర్జికల్ స్ట్రైక్-2: భారత వైమానిక దాడిపై స్పందించిన క్రికెటర్లు

హైదరాబాద్: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంపై యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2 పేరిట మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం చేసిన దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో జైషే ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యాయి. మొత్తం 12 మిరేజ్ 2000 జెట్స్ ఈ దాడిలో పాల్గొన్నాయి.
పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై సుమారు వెయ్యి కిలోల బాంబులు డ్రాప్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. లేజర్ గైడెడ్ బాంబులతో ఈ దాడి చేసినట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన శిబిరాలపై దాడి జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ దాడి ఘటనలో సుమారు 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

బాలాకోట్, ముజప్ఫర్ నగర్ ప్రాంతాల్లో
ఎల్ఓసీ ప్రాంతాలైన బాలాకోట్, ముజప్ఫర్ నగర్ ప్రాంతాల్లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత భారత వైమానిక దళం పైలెట్లు 21 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ కంట్రోల్ రూమ్‌లన్నీ ధ్వంసం అయినట్లు అంచనా వేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు వెంట మిరేజ్ యుద్ధ విమానాలతో చేసిన దాడి నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారమే దాడి
పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని అంటున్నారు. అర్థరాత్రి పూట ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్-2 సక్సెస్ అయిందని, ఇక హై అలర్ట్‌లో ఉండడం మన బాధ్యత అని మేజర్ జనరల్ ఏకే సివాచ్ తెలిపారు. తాజా సర్జికల్ స్ట్రైక్-2తో పాకిస్థాన్ భూభాగంలోకి 1971 యుద్ధం తర్వాత భారత ఫైటర్ జెట్లు వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది.
మిరేజ్‌లతో దాడి చేసిన భారత వైమానికి దళం
ఇటీవల పుల్వామాలో జరిగిన సూసైడ్ దాడికి తామే కారణమని జైషే సంస్థ ప్రకటించడంతో ఎల్ఓసీలోని ఆ ఉగ్ర సంస్థ స్థావరాలపై భారత వైమానిక దళం మిరేజ్‌లతో దాడి చేసింది. భారత వైమానిక దళం దాడులపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "జవాన్లు.. మీ ఆట అదిరింది" అంటూ సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్
మరొక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ "భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్' అని ట్వీట్ చేయగా... గౌతమ్ గంభీర్ మాత్రం "జై హింద్ ఐఎఎఫ్" అంటూ ట్వీట్ చేశాడు. చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపించాడుప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications