Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి ఉన్న ప్రతిభ రోహిత్‌కు లేదు.. దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

IND vs ENG: ఇంగ్లండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ భారత జట్టుకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మే నెలలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వారి రిటైర్మెంట్ తర్వాత వారి స్థానంలో ఎవరు వస్తారు అనే చర్చ మొదలైంది.

'ది డైలీ టెలిగ్రాఫ్'లో రాసిన కాలమ్ ద్వారా జెఫ్రీ బాయ్‌కాట్ కీలక ప్రకటన చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌ను ఓడించే అవకాశాలు తగ్గాయని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ టీమిండియాకు అత్యంత భారీ నష్టంతో సమానమని... ఎందుకంటే విరాట్ కోహ్లీ జట్టులో బెస్ట్ బ్యాటర్ అని స్పష్టం చేశారు. భారత జట్టు చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుందని.. కానీ విశ్రాంతి చాలా తక్కువగా ఉంటుందని.. దీని వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని జెఫ్రీ బాయ్‌కాట్ అన్నారు.

Boycott s Bold Claim Kohli s Retirement a Bigger Loss Than Rohit s for India

రోహిత్ లోటు అంతగా కనిపించదు!
జెఫ్రీ బాయ్‌కాట్ ఇంకా మాట్లాడుతూ.. ఎంత ప్రతిభ, అనుభవం ఉన్నప్పటికీ.. మానసికంగా సవాలుకు సిద్దంగా లేరని భావిస్తే అది మంచి విషయం కాదన్నారు. రోహిత్ అద్భుతమైన బ్యాటర్ అని, అద్భుతమైన షాట్లు ఆడేవాడని, కానీ కోహ్లీతో పోలిస్తే రోహిత్ లేని లోటు టీమిండియాకు అంతగా కనిపించదని.. ఎందుకంటే రోహిత్ టెస్ట్ రికార్డు అంతగా లేదన్నారు. విరాట్ కోహ్లీ లాంటి సహజసిద్ధమైన ప్రతిభ రోహిత్ శర్మకు లేదని కూడా ఆయన అన్నారు. ఇంగ్లండ్‌లో ఓపెనింగ్ చేయడం ఎంత కష్టమైన పనో రోహిత్ శర్మకు తెలుసు అని బాయ్‌కాట్ పేర్కొన్నారు.

రోహిత్ శర్మ టెస్టు రికార్డు
రోహిత్ శర్మ తన 67 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్‌లో మొత్తం 4,301 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మ సగటు 40.58గా ఉంది. టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ 12 సెంచరీలు, 18 అర్థ సెంచరీలు సాధించాడు. టెస్ట్ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా, ఆరో నంబర్ బ్యాటర్‌గా ఎక్కువ అవకాశం లభించింది.

Story first published: Wednesday, June 18, 2025, 18:11 [IST]
Other articles published on Jun 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+