ఐపీఎల్‌తో కొంప కొల్లేరు - అంగీకరించిన రోహిత్ శర్మ ..!!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది. చెత్త బౌలింగ్‌తో చిత్తయింది. టీమిండియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా కొట్టి అవతల పడేసిందంటే- బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. జోస్ బట్లర్- 80, అలెక్స్ హేల్స్- 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
జీరో వికెట్స్
టీమిండియా బౌలింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిదన్నట్టు తయారైంది. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా- ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్ల కౌంటర్ అటాక్‌కు వారి వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఒక్కొక్కరు భారీగా పరుగులను సమర్పించుకున్నారు. అక్షర్ పటేల్ మాత్రమే తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసుకోగలిగాడు.
బాయ్‌కాట్ ఐపీఎల్..
ఈ ఓటమి తరువాత #BoycottIPL అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ హ్యాష్‌ట్యాగ్ కింద వేల సంఖ్యలో ట్వీట్లు పడ్డాయి. టీమిండియా ఇంత అధ్వాన్నంగా ఓడిపోవడానికి ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటే ప్రధాన కారణమంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. దేశం తరఫున ఆడాల్సిన ప్లేయర్లు డబ్బు యావలో పడ్డారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆటగాళ్ల దృష్టి మొత్తం ఐపీఎల్ మీదే ఉందని, ఫ్రాంఛైజీలు ఇచ్చే డబ్బుల కోసం ఆడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు.
జై షాపై
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జై షాపైనా ఆరోపణలను సంధిస్తోన్నారు అభిమానులు. నెక్స్ట్ టీ20 ప్రపంచకప్ ఆడే జట్టుకు జై షాను కేప్టెన్ చేయాలంటూ చురకలు అంటిస్తోన్నారు. బీసీసీఐలో కూడా రాజకీయాలు చొరబడ్డాయని, దాని ఫలితమే ఐసీసీ టోర్నమెంట్లల్లో భారతజట్టు ఓటమి పాలవుతోందని ధ్వజమెత్తుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆగస్టులో ముగిసిన ఆసియా కప్ టోర్నమెంట్‌లోనూ భారత్ కనీసం సెమీ ఫైనల్స్ కూడా చేరని విషయాన్ని గుర్తు చేస్తోన్నారు.
అంగీకరించిన రోహిత్ శర్మ..
ఈ విషయాన్ని రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడిన హిట్ మ్యాన్- ఐపీఎల్ పేరును ఉచ్ఛరించాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ వంటి హైప్రెజర్ గేమ్స్ ఆడిన అనుభవం తమ జట్టు ప్లేయర్లకు ఉందని, ఒత్తిడిని ఎదుర్కొన్న సామర్థ్యం నేర్చుకున్నాడనీ అన్నాడు. ఇక్కడ అవేవీ ఫలించలేదని పేర్కొన్నాడు. నాకౌట్ దశలోకి వచ్చేసరికి ఒత్తిడిని జయించాల్సిన అవసరం ప్లేయర్లకు ఉంటుందని, ఇక్కడ అది ఫలించలేదని విశ్లేషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications