For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రబాడ విజృంభణ.. టెస్టు చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా బోణీ!!

Boxing Day Test: Quinton de Kock, Kagiso Rabada heroics help South Africa snap losing streak

సెంచూరియన్‌: భారత్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన దక్షిణాఫ్రికా సమిష్టిగా రాణించి ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. తొలి టెస్టు (బాక్సింగ్‌డే టెస్టు)లో దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ (4/103) చెలరేగాడు. దీంతో 107 పరుగులతో విజయం సాధించిన సఫారీలు నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్నారు. విజయం ఇరు జట్లతో దోబూచులాడినా.. చివరకు దక్షిణాఫ్రికానే వరించింది.

పటిష్ఠ స్థితిలోనే ఇంగ్లండ్‌

పటిష్ఠ స్థితిలోనే ఇంగ్లండ్‌

376 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ శనివారం ఆట ముగిసే సమయానికి 121/1 స్కోరుతో పటిష్ఠ స్థితిలోనే నిలిచింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఇంగ్లీష్ జట్టు విజయంపై కన్నేసినట్టే కనిపించింది. కానీ ఆదివారం నాలుగో రోజు ఆటలో పేసర్లు రబాడ (4/103), ఎన్రిచ్‌ నోర్టే (3/56) కట్టుదిట్టమైన బంతులకు ఇంగ్లండ్‌ 93 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది.

రబాడ విజృంభణ

రబాడ విజృంభణ

ఓవర్‌నైట్‌ స్కోరు 121/1తో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌.. కాసేపటికే బర్న్స్‌ (154 బంతుల్లో 84; 11 ఫోర్లు) వికెట్‌ కోల్పోయింది. అయినా డెన్లీ (31), రూట్‌ (48) నిలకడగా ఆడటంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖాయమే అనిపించింది. ఈ సమయంలో రబడ, నోర్జే రెచ్చిపోవడంతో 64 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

టెస్టు చాంపియన్‌షిప్‌లో బోణీ

టెస్టు చాంపియన్‌షిప్‌లో బోణీ

డికాక్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. తాజా విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో డుప్లెసిస్‌ సేన ఖాతా తెరిచింది. ఈ గెలుపు అనంతరం దక్షిణాఫ్రికాకు 30 పాయింట్లు లభించాయి. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మొదటి పోరులోనే విజయం

మొదటి పోరులోనే విజయం

దక్షిణాఫ్రికా జట్టు గత కొంతకాలంగా సంధి దశలో ఉన్న విషయం తెలిసిందే. దిగ్గజ క్రికెటర్లు గ్రేమ్‌ స్మిత్, మార్క్‌ బౌచర్, జాక్వస్‌ కలిస్‌ టీమ్‌ డైరెక్టర్, కోచ్, సలహాదారుల పాత్రలోకి వచ్చిన తర్వాత బరిలోకి దిగిన మొదటి పోరులోనే ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయాలను దక్షిణాఫ్రికా కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Story first published: Monday, December 30, 2019, 8:58 [IST]
Other articles published on Dec 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+