విచిత్రం: పాకిస్థాన్-ఆస్ట్రేలియా టెస్టులో ధోని పేరు
హైదరాబాద్: క్రికెట్ అభిమానానికి హద్దులు ఉండవు. దేశం, ప్రాంతం, మతంతో వారికి సంబంధం లేదు. అభిమానులకు తెలిసిందల్లా ఒక్కటే తమ అభిమాన క్రికెటర్లను ఆరాధించడం, ఆటను ఆస్వాదించడమే. తాజాగా మెల్ బోర్న్ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ విచిత్రం చోటు చేసుకుంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అభిమాని పాకిస్థాన్ క్రికెట్ జెర్సీని ధరించి స్టేడియంలో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ అభిమాని ధరించిన జెర్సీ వెనకవైపు నెం.7 (ధోని జెర్సీ నెంబరు) దానిపైన 'ధోని' అని రాసుండటంతో కెమెరాలు అతడి మీదే దృష్టిసారించాయి.
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మెల్‌బోర్న్ స్టేడియంలో పాక్ అభిమాని ధోని జెర్సీతో కనిపించడం చర్చనీయాంశమైంది. కాగా ఇటీవలే అసోంలో జరిగిన ఓ స్ధానిక క్రికెట్ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రీదిపై అభిమానంతో పాకిస్థాన్ జెర్సీని ధరించిన ఓ అభిమానిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆస్ట్రేలియాతో ఈ ఏడాది జనవరి 26న జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 90 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాక్‌లోని ఓ అభిమాని భారత్ జెండా తన ఇంటిపై ఎగరేసినందుకు ఆ అభిమానికి పదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాల మధ్య వైరమే కానీ.. ప్రజల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని పలువురు భారత్-పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications