బాక్సింగ్ డే టెస్టు: అభిమానులు గేలి చేయడం చూడలేదన్న స్టీవ్ స్మిత్!

హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టులో న్యూజిలాండ్ అభిమానులు తనను గేలి చేయడం చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ టెస్టులో తొలి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 67/2తో నిలిచింది. స్టీవ్ స్మిత్, లబుషేన్ క్రీజులో ఉన్నారు. విరామానికి ముందు ఇన్నింగ్స్ 26వ ఓవర్‌ను వేస్తున్న వాగ్నర్.. ఓ బంతిని షార్ట్ పిచ్‌గా వేసాడు.

ఆ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు
ఆ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ.. ఆ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే స్మిత్ సింగిల్ తీసే ప్రయత్నాన్ని ఫీల్డ్ అంపైర్ నిగేల్ లాంగ్ అడ్డుకున్నాడు. దీంతో స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. స్మిత్ వినిపించుకోకుండా బ్రేక్‌కు వెళ్లిపోయాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం
ఐసీసీ నిబంధనల ప్రకారం.. బ్యాట్స్‌మన్ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్‌ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్ అవుతుంది. అంతకుముందు ఓవర్‌లో కూడా ఇలానే జరగడంతో స్మిత్ గొడవపడ్డాడు. ఇది చూసిన న్యూజిలాండ్ అభిమానులు అతడిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

వేసవిలో నువ్వేం చేశావో మాకు తెలుసు
"గతేడాది వేసవిలో నువ్వేం చేశావో మాకు తెలుసు" అని ఒకతను ప్లకార్డు పట్టుకోగా మరొకరు బాల్ టాంపరింగ్ వివాద సమయంలో స్మిత్ ఏడుస్తూ మీడియాతో మాట్లాడిన ఫొటోను ఎత్తిచూపాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి ఇదే విషయాన్ని స్మిత్ వద్ద ప్రస్తావించాడు.

తనను గేలిచేయడం చూడలేదన్న స్మిత్
ఈ ప్రశ్నకుు కివీస్ అభిమానులు తనను గేలిచేయడం చూడలేదని స్మిత్ చెప్పాడు. నిజంగా అలా చేశారా? అంటూ విలేకర్లనే ఎదురు ప్రశ్నించాడు. చాలా రోజులుగా తాను అలాంటి వాటిని పట్టించుకోవడం లేదని అన్నాడు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్ ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications