కుప్పకూలిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్

మెల్‌బౌర్న్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ బౌలర్లు జోరు అందుకున్నారు. దీంతో ఆటలో మూడో రోజైన శుక్రవారం 8/0తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు లంచ్ విరామానికే 89/4తో కష్టాల్లో పడింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఇంకా భారత్ కంటే 354 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. గురువారం చతేశ్వర్ పుజారా సెంచరీతో టీమిండియాకు మంచి స్కోరు తెచ్చిపెట్టడంతో మొదటి ఇన్నింగ్స్‌ని 443/7 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
మయాంక్ చేతికి చిక్కిన ఫించ్
శుక్రవారం తొలి సెషన్ ఆరంభంలోనే భారత్‌కి ఓపెనర్ అరోన్ ఫించ్ (8: 36 బంతుల్లో ఒక ఫోర్) రూపంలో వికెట్ లభించింది. జట్టు స్కోరు 24 వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయిన అరోన్ ఫించ్.. ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కాడు. అయితే.. మరో ఓపెనర్ హారిస్ (22: 35 బంతుల్లో 2ఫోర్ల)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన ఉస్మాన్ ఖవాజా (21: 32 బంతుల్లో 3ఫోర్ల) సిరీస్‌లో తొలిసారి దూకుడుగా ఆడాడు. కానీ.. అతని దూకుడుకి జడేజా కళ్లెం వేయగా.. హారిస్‌నీ బుమ్రా బోల్తా కొట్టించాడు.
102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి
దీంతో.. 53/3తో ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ దశలో షాన్ మార్ష్ (19: 61 బంతుల్లో 1ఫోర్) క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినా.. లంచ్ విరామానికి ముందే అతడ్ని బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. బుమ్రా బంతిని అంచనా వేయడంలో విఫలమైన మార్ష్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఇలా 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది.

243 లోపు ఆతిథ్య జట్టు ప్యాకప్ అయితే
ఫించ్‌ను ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్‌కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9)లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో టీమ్ పెయిన్ (2), ప్యాట్‌కమిన్స్(0) లున్నారు. 243 లోపు ఆతిథ్య జట్టు ప్యాకప్ అయితే ఫాలోఆన్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications