పెర్త్: భారత్ యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్‌మెన్ బరిందర్ శ్రాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి.. ఈ రోజు వన్డేతో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లోని వాకా మైదానంలో జరుగుతున్న వన్డేలో ఆరంగేట్రం చేశాడు. ఇతను ఓ సాధారణ రైతు కొడుకు కావడం గమనార్హం.
- బరిందర్ శ్రాన్ తొలి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు మైదానంలోకి అడుగు పెట్టగానే సహచరులు చప్పట్లతో అతనికి స్వాగతం పలికారు. బరిందర్ వయస్కు 23 ఏళ్లు.
- శ్రాన్ తండ్రి బల్బీర్ సింగ్ రైతు. 2007లో బాక్సర్ అయ్యేందుకు బరిందర్ శ్రాన్... భివానీ (పంజాబ్) వెళ్లాడు. ప్రముఖ భివానీ బాక్సింగ్ క్లబ్‌లో అతను శిక్షణ పొందాడు. ఇదే క్లబ్‌లో భారత్ ఒలింపిక్ మెడల్ విజేత విజేందర్ సింగ్ కూడా శిక్షణ తీసుకున్నారు.

- 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం ప్రకటన వెలువడింది. పత్రికలలో బరిందర్ సింగ్ దానిని చూశాడు. మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సెలక్షన్స్ కోసం పిలిచింది. అప్పుడు బరిందర్ సెలక్ట్ కాలేదు. కానీ అతని జీవితాన్ని మాత్రం మార్చేసింది.
- ఆ తర్వాత బరిందర్ శ్రాన్ గేటరేడ్ స్పీడ్ స్టర్ కాంటెస్ట్‌లో గెలుపొందాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీకి వెళ్లాడు.
- 2011 అక్టోబర్ నెలలో బరిందర్ శ్రాన్ సీనియర్లతో తొలిసారి మ్యాచ్ రుచి చూశాడు. అదే సంవత్సరం ఫస్ట్ క్లాస్‌లో ఆడాడు. రంజీ ట్రోఫీ ఆడాడు.
- గాయాల వల్ల బరిందర్ శ్రాన్ మూడేళ్లు పాటు దూరంగా ఉన్నాడు.
- ఆ తర్వాత మరోసారి బరిందర్ శ్రాన్ సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్లాడు. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సెలక్షన్స్ కోసం వెళ్లాడు. రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రావిడ్‌ను బరిందర్ సింగ్ ఇంప్రెస్ చేసాడు.
- 2015 ఫిబ్రవరిలో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరులో జరిగిన వేలంలో బరిందర్ శ్రాన్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.
- జహీర్ ఖాన్, పాక్ బౌలర్ వసీమ్ అక్రమ్‌లను ఆరాధిస్తాడు. తనకు జహీర్ ఖాన్‌తో మాట్లాడే అవకాశం రాలేదని, వసీంతో మాత్రం 15 - 20 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చిందని బరిందర్ బిసిసిఐ వెబ్ సైట్‌తో చెప్పాడు.

- టిమ్ సోథీ, జేమ్స్ ఫాల్కనర్ వంటి వారితో నేను మాట్లాడానని, వారు తనకు ఎన్నో సూచనలు చేశారని బరిందర్ శ్రాన్ అంటాడు. రాహుల్ ద్రావిడ్ తనకు విశ్వాసం కలిగించాడని, అతను ఎంతో ప్రోత్సహించాడని చెప్పాడు. అతను ఎప్పుడూ తనను ప్రోత్సహించాడని చెబుతాడు.
- 2015 అక్టోబర్ నెలలో రంజీ ట్రోఫీలో రైల్వై జట్టు పైన శ్రాన్ ఆరు వికెట్లు తీశాడు. (17-4-61-6). అతనిని యువరాజ్ జహీర్ ఖాన్‌తో పోల్చాడు.
- 2015 నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచులకు భారత్ వచ్చినప్పుడు మొహాలీ టెస్ట్ మ్యాచ్ స్టేడియంలో నెట్ బౌలింగ్ చేశాడు.
- డిసెంబర్ 20, 2015న వన్డే స్క్వాడ్‌కు బరిందర్ శ్రాన్ ఎంపికయ్యాడు.
- జనవరి 12, 2016న శ్రాన్ తొలి వన్డే క్రికెట్ ఆడాడు. పెర్త్‌లో ఆడాడు.
- బరిందర్ సింగ్ ఎప్పుడూ బాక్సర్ కావాలని అనుకున్నాడు. విజేందర్ సింగ్, ఇతర హర్యానా బాక్సర్లు ఆదర్శం అని చెప్పేవాడు. భివానీలో శిక్షణ సమయంలో ఎంతో నేర్చుకున్నానని చెబుతాడు.
పూర్తి పేరు - బరిందర్ బల్బీర్ సింగ్ శ్రాన్
వయస్సు - 23 ఏళ్లు
పుట్టిన తేదీ - 10 డిసెంబర్ 1992
ఫస్ట్ క్లాస్ కెరీర్ - నవంబర్ 2011న ఆరంగేట్రం (పంజాబ్ వర్సెస్ ఒడిశా)
మ్యాచులు - 11, వికెట్లు - 32
లిస్ట్ ఏ (50 ఓవర్లు) - ఫిబ్రవరి 2012 ఢిల్లీ పైన ఆరంగేట్రం.
మ్యాచులు - 8, వికెట్లు - 16
ట్వంటీ 20 - ఆరంగేట్రం అక్టోబర్ 2011, మ్యాచులు 10, వికెట్లు 8
ఐపీఎల్ - మే 2015, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరంగేట్రం, మ్యాచులు ఒకటి, వికెట్లు జీరో.