Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nikhat Zareen: మోడీ సారు ఆ విషయం గురించి నన్ను అడిగారు.. ఆ విషయం ఆయనకెలా తెలిసిందని ఆశ్చర్యపడ్డా

Boxer Nikhat Zareen Was Surprised By PM Modi Enquired About Her Mom

భారత బాక్సర్ నిఖత్ జరీన్ తన పవర్ ప్యాక్డ్ పంచ్‌లతో బిగ్ టోర్నీల్లో పతకాలు తెస్తూ.. భారత్‌కు గర్వకారణంగా మారింది. ఇటీవల ఆమె కామన్వెల్త్ గేమ్స్ (CWG)లో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఢిల్లీలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని తాను కలిసిన విషయం గురించి నిఖత్ జరీన్ షేర్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. 'మా అమ్మకు నేను చేసిన వాగ్దానం గురించి.. గోల్డ్ మెడల్ గెలవడం గురించి మోదీ సార్ నన్ను అడిగాడు. అతను వాస్తవానికి అథ్లెట్లందరితో మాట్లాడాడు.. ప్రతిఒక్కరూ వారి కామన్ వెల్త్ అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా నాతో మాత్రం మా అమ్మ గురించి అడగడం ఆశ్చర్యంతో పాటు ఎనలేని సంతోషాన్నిచ్చింది' అని జరీన్ తెలిపింది.

స్పెషల్ బిర్యానీ వండి పెట్టు

స్పెషల్ బిర్యానీ వండి పెట్టు

ఇక నిఖత్ జరీన్.. మన ఇంటికి గోల్డ్ మెడల్ తీసుకువస్తానని ఆమె తల్లికి వాగ్దానం చేయడం, ఇంకా అందుకు అనుగుణంగా తన శిక్షణను కొనసాగించడం.. ఇంకా తన జీవితంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా నిఖత్ పంచుకుంది. 'నేను అమ్మీకి ఫోన్ చేసి.. 'ఆప్కా గిఫ్ట్ లేకర్ ఆ రహీ హూన్' అన్నాను. ఆమె చాలా సంతోషపడింది. నేను ఢిల్లీలో అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉంది. అవన్నీ పూర్తి కాగానే త్వరగా ఇంటికి తిరిగి వస్తా. నా కోసం స్పెషల్‌గా బిర్యానీ వండు అని అమ్మకు చెప్పాను' అని నిఖత్ జరీన్ పేర్కొంది.

 అందుకే నెయిల్ ఆర్ట్ వేసుకున్నా

అందుకే నెయిల్ ఆర్ట్ వేసుకున్నా

ఇక తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని చాటుకుంది. జాతీయ జెండా ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటుంది అని జరీన్ తెలిపింది. ఆమె కామన్ వెల్త్ గేమ్స్‌లో త్రివర్ణ పతాకం కలిగి ఉన్న నెయిల్ ఆర్ట్‌‌ను తన గోళ్లపై వేసుకుంది. అలా నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ఆమె చెప్పిన రీజన్ కూడా ఆమె దేశభక్తికి నిదర్శనంగా నిలస్తుంది. 'నా గోళ్లు చూసినప్పుడల్లా మా అమ్మీకి నేను చేసిన వాగ్దానాన్ని ఈ నెయిల్ ఆర్ట్ నాకు గుర్తు చేస్తుంది. అలాగే భారత జెండా నా కళ్లముందు అత్యుత్తమ స్థితిలో ఆవిష్కరించాలనే విషయం కూడా గుర్తుకొస్తుంది. అందువల్ల రింగ్‌లో నేను ఆడటానికి, నేను నిరంతరం మోటివేట్ కావడానికి ఈ భారత పతాక ఆర్ట్ నన్ను ప్రేరేపిస్తుంది' అని నిఖత్ తెలిపింది.

 అలాంటి విషయాలు మరింత రాణించేలా చేస్తాయి

అలాంటి విషయాలు మరింత రాణించేలా చేస్తాయి

ఇకపోతే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె స్వర్ణం సాధించిన మూడు నెలల తర్వాత ఆమె కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. కామన్‌వెల్త్ ముగింపు వేడుకలో భారతదేశ ఫ్లాగ్ బేరర్‌‌గా వ్యవహరించి తెలంగాణ ఖ్యాతిని నిలిపింది. ఫ్లాగ్ బేరర్‌గా నన్ను ఎంచుకున్నందుకు నేను నిజంగా కృతజ్ఞురాలిని. ఇలాంటి విషయాలు నన్ను మరింత రాణించేలా ప్రేరేపిస్తాయి' అని 26ఏళ్ల జరీన్ చెప్పింది. ఆమె పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా భారత్‌కు పతకం తెచ్చే ఒకానొక ఆశాకిరణమని చెప్పొచ్చు. ఇక నీతు ఘంఘాస్ వంటి తోటి బాక్సర్‌లతో ఆమె పోటీ పడి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాల్సి ఉన్నందున.. ఈ విషయమై నిఖత్ మాట్లాడుతూ.. ఎవరు బరిలోకి వచ్చినా పర్వాలేదు. ఎవరు కష్టపడి తమ వంతు కృషి చేస్తారో వారు తప్పకుండా గెలుస్తారు' అని నిఖత్ తెలిపింది.

Story first published: Monday, August 15, 2022, 18:24 [IST]
Other articles published on Aug 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+