For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

14 ఏళ్ల తర్వాత సెహ్వాగ్‌పై ఐసీసీ...

 Bowling to Virender Sehwag had a demoralising effect on me, reveals R Ashwin

హైదరాబాద్: పద్నాలుగేళ్ల అనంతరం సైతం ఐసీసీ వీరేంద్ర సెహ్వాగ్‌ను విడిచిపెట్టలేదు. అప్పట్లో సెహ్వాగ్ రికార్డు అనే స్థాయిలో ట్వీట్ చేసింది. భారత ఆటగాళ్ల ఖ్యాతిని పెంచి, క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన సెహ్వాగ్‌కు ఇవాళ చాలా స్పెషల్‌ డే. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో భారత్‌ తరపున తొలి ట్రిపుల్‌ సాధించిన ఆటగాడు వీరూనే. సరిగ్గా ఆ అరుదైన రికార్డుకు నేటితో సరిగ్గా 14 ఏళ్లు నిండుతున్నాయి.

2004వ సంవత్సరంలో పాకిస్థాన్‌ టూర్‌ సందర్భంగా ముల్తాన్‌ టెస్ట్‌‌లో సెహ్వాగ్‌ ఈ ఘనతను కైవసం చేసుకున్నారు. మొత్తం 531 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న వీరూ.. 375 బంతులెదుర్కుని 309 పరుగులు సాధించారు.
ఇక మొత్తం స్కోరులో.. 39 ఫోర్‌లు, 6 సిక్సర్లు ఉన్నాయి. షోయబ్‌ అక్తర్‌, సక్లైన్‌ ముస్తాక్‌, సమీ, రజాక్‌ వేసిన బంతులను చితకబాదుతూ మైదానంలో వీరూ విశ్వరూపం ప్రదర్శించారు.

ఇక అరుదైన ఈ రికార్డును ఐసీసీ గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో 319 పరుగులు చేసి రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. చివరిసారిగా భారత్‌ తరపున యువ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. 2016లో నాయర్‌ ఇంగ్లాండ్‌పై చెన్నైలో జరిగిన టెస్టులో 303 పరుగులు సాధించాడు.

డబుల్ ట్రిపుల్ సెంచరీ దిశగా సెహ్వాగ్:
ఇదే నెల మార్చిలో సెహ్వాగ్ వీరోచిత పోరాటం ప్రదర్శించి టెస్టు క్రికెట్ చరిత్రలోనే తన రికార్డును తానే బద్దలు కొట్టుకునేలా 278 బాల్స్‌లో మరో సారి ట్రిపుల్ సెంచరీ చేశాడు. మొదటి సారి 2004లో పాకిస్థాన్ గడ్డపై అదే జట్టుతో ట్రిపుల్ సెంచరీ గెలిచిన సెహ్వాగ్.. మరోసారి దక్షిణాఫ్రికాపై తలపడి 2008 మార్చి 27వ తేదీ డబుల్ ట్రిపుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

Story first published: Thursday, March 29, 2018, 11:09 [IST]
Other articles published on Mar 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+