Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులభం కాదు: అశ్విన్

Bowling in partnership is important for India against Australia: Ashwin

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై విజయం సాధించాలంటే పరుగుల భాగస్వామ్యాలతో పాటు బౌలింగ్‌ భాగస్వామ్యాలూ ఎంతో కీలకమని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది.

 రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ

రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ "కోరుకున్న ఫలితం రావాలంటే బౌలింగ్‌ భాగస్వామ్యాలు చాలా కీలకం. సమష్టిగా బౌలింగ్‌ చేస్తేనే ప్రత్యర్థిని కుప్పకూల్చొచ్చు. ప్రతిసారీ ఒక్కరే అవతలి జట్టును దెబ్బకొట్టలేరు. ఒక స్పిన్నర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సరైన ప్రణాళికతో బంతులు వేసి వికెట్లు తీయడం అత్యంత అవసరం" అని అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగుతా

రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగుతా

"రెండో ఇన్నింగ్స్‌లోనూ సాయం దొరికితే నేను చెలరేగుతా. గత పర్యటనలో అలాగే చేశా. ఆ సిరీస్‌లో నేను బాగా ఆడాను. అది నా కెరీర్‌లో ఒక కీలక మలుపు" అని అశ్విన్‌ అన్నాడు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అశ్విన్ 24 ఓవర్లు విసిరి 63 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసిన సంగతి తెలిసందే.

వార్మప్ మ్యాచ్‌లో బాగా ఆడాం

వార్మప్ మ్యాచ్‌లో బాగా ఆడాం

"వార్మప్ మ్యాచ్‌లో బాగా ఆడాం. బంతుల్ని చక్కగా వేశా. అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి కొన్ని రోజులైంది. రాబోయే నాలుగైదు రోజుల్లో మరింత సన్నద్ధమవుతా. యువ ఆటగాడు పృథ్వీషా గాయపడడం బాధాకరం. ప్రతి దానికీ ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతా. అతడి స్థానంలో మరొకరికి అవకాశం వస్తుంది. ప్రత్యర్థి జట్టులో నాథన్‌ లయాన్ చాలా బాగా బౌలింగ్‌ చేస్తాడు" అని అశ్విన్ అన్నాడు.

సిరీస్‌ గెలవడం అంత సులభం కాదు

సిరీస్‌ గెలవడం అంత సులభం కాదు

"నాథన్ లయాన్ బౌలింగ్‌ వీడియోలు చూశాను. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఒక వ్యక్తిగా, జట్టుగా అవతలివారి డ్రెస్సింగ్‌ రూమ్‌ వ్యవహారాల్లో తలదూర్చడం సరికాదు. ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలవడం సులభం కాదు. అందుకే కంగారూలే ఫేవరెట్‌" అని అశ్విన్‌ అన్నాడు.

Story first published: Saturday, December 1, 2018, 12:17 [IST]
Other articles published on Dec 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+