Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs AUS: శుభ్ మన్​ గిల్ గాయంపై క్లారిటీ ఇచ్చిన బౌలింగ్ కోచ్..

నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. భారత్ మొదటి మ్యాచ్ లో బుమ్రా నాయకత్వంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఆడాడం సందేహంగా మారింది. అతని చేతి వేలికి గాయమైనట్లు తెలిసింది. గిల్ ఫిట్‌నెస్‌పై టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అప్డేట్ ఇచ్చాడు. మ్యాచ్ రోజు ఉదయం గిల్ పరిస్థితిని బట్టి తుది ఎంపిక ఉంటుందని చెప్పాడు. గిల్ కోలుకుంటున్నాడని వివరించాడు.

"శుబ్‌మన్ రోజురోజుకు మెరుగుపడుతున్నాడు. మేము టెస్ట్ రోజు ఉదయం నిర్ణయం తీసుకుంటాం. సిమ్యులేషన్‌లో బాగా ఆడాడు" అని మోర్కెల్ మీడియా చెప్పాడు. శనివారం (నవంబర్ 16) పెర్త్‌లో మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గిల్ బొటనవేలు విరిగింది. గాయాన్ని స్కాన్ చేసిన తర్వాత దాని తీవ్రతను గుర్తించారు. గిల్ మొదటి మ్యాచ్ ఆడకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Bowling coach Morne Morkel gives clarity on Shubman Gill s playing in the upcoming first Test against Australia

సిమ్యులేషన్ మ్యాచ్‌లో గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు. నవదీప్ సైనీ వేసిన బంతిని గల్లీ వద్ద క్యాచ్ పట్టినప్పుడు చేతి వేలికి గాయం అయింది. అతను తర్వాత బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్ ప్రస్తుత సీజన్ లో10 మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌ల ఆడాడు. 806 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉంది. అతను 47 కంటే ఎక్కువ సగటుతో ఆడాడు.

మూడవ స్థానంలో గిల్ 14 మ్యాచ్‌లలో 42.09 సగటుతో 25 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, అర్ధసెంచరీలతో 926 పరుగులు చేశాడు.
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ తరఫున ఏడు వికెట్లు పడగొట్టి, ఇటీవల చీలమండ గాయం నుండి తిరిగి వచ్చిన మహ్మద్ షమీ పరిస్థితిపై కూడా మోర్కెల్ స్పందించాడు. " మేము షమీని నిశితంగా గమనిస్తున్నాము. అతను ఒక సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అతను తిరిగి ఆడటం శుభపరిణామం" అని మోర్కెల్ వివరించాడు.
ేే

Story first published: Wednesday, November 20, 2024, 17:18 [IST]
Other articles published on Nov 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+