ఇదే ప్లాన్‌తో పాకిస్తాన్‌పై అటాక్ - ఆస్ట్రేలియాపై గెలవడానికి కారణాలు చెప్పిన రోహిత్ శర్మ..!!

బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా.. ఆ దేశ జట్టుతో తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు ఆరంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వామప్ మ్యాచే అయినప్పటికీ.. నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టింది.

ఆరు పరుగుల తేడాతో..
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా తడబడింది. చేతులెత్తేసింది. 180 పరుగుల వద్దే ఆగిపోయిందా జట్టు జర్నీ. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఒత్తిడికి గురైంది. ఆ ఓవర్‌లో నాలుగు వికెట్లను కోల్పోయింది. చివరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు పడ్డాయి.

చివరి ఓవర్ హీరో..
చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా పరాజయాన్ని చవి చూడటం ఒక ఎత్తయితే.. నాలుగు వికెట్లను కోల్పోవడం మరో ఎత్తు. మహ్మద్ షమీ విసిరిన తొలి రెండు బంతులకు నాలుగు పరుగులొచ్చాయి. నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో వరుసగా వికెట్లు పడ్డాయి. నాలుగు బంతులకు నలుగురు బ్యాటర్లు అవుట్ అయ్యారు. మూడో బంతికి పాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యాడు. ఒంటి చేత్తో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నాలుగో బంతికి అష్టన్ అగర్ రనౌట్ అయ్యాడు.

ప్లాన్ ప్రకారమే..
అయిదు, ఆరు బంతులకు వరుసగా ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌లను బలితీసుకున్నాడు షమీ. చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది ఆసీస్. ఆస్ట్రేలియా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏ స్థాయిలో ఒత్తిడికి గురయ్యారనేది ఈ ఓవర్‌తో తేలిపోయింది. మ్యాచ్ గెలిచిన తరువాత రోహిత్ శర్మ మాట్లాడాడు. షమీని ఆకాశానికెత్తేశాడు. డెత్ ఓవర్లల్లో షమీని బౌలింగ్‌కు దింపడం కంటే మంచి ప్లాన్ మరొకటి ఉండబోదని స్పష్టం చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే షమీని బంతిని అందిస్తామని, దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూశారని వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ గుడ్..
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ బాగుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 20 ఓవర్ల వరకూ ఆడాలని భావించామని, అదే చేశామని చెప్పుకొచ్చాడు. ఇంకా 10 నుంచి 15 పరుగులు జోడించి ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు రోహిత్. బౌన్సీ పిచ్ నుంచి తమ అంచనాలకు అనుగుణంగా బ్యాటర్లు రాణించారని, ప్రత్యేకించి కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. బౌండరీలతో పాటు సింగిల్స్ కూడా ముఖ్యమేనని, అవి ఈ మ్యాచ్‌లో సాధించామని గుర్తు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications