Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోండి: రెండో టీ20లో క్యూరేటర్ సలహా

Bowling 1st will be a good option in Indore: Curator Samandar

హైదరాబాద్: రెండో టీ20లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ క్యూరేటర్‌ సమందర్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టాస్‌ గెలిచిన జట్టు ముందు బౌలింగ్‌ ఎంచుకోవడం మంచిదని ఇరు జట్ల కెప్టెన్లకు సలహా ఇచ్చాడు. ఎందుకంటే తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న జట్టు మొదటి 10 ఓవర్లు వేసే సమయంలో మంచు ప్రభావం ఉండదని తేల్చి చెప్పాడు.

'గురువారం రాత్రి 7.45 గంటల వరకు ఎలాంటి మంచు లేదు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అందుకే టాస్‌ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంటే వారు తమ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లను తక్కువ స్కోరుకే ఔట్ చేయొచ్చు. అప్పుడు వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి' అని అన్నాడు.

ఇక, మంచు ఎక్కువగా పడితే మైదానాన్ని కాస్త పొడిగా చేసేందుకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపాడు. కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించి సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రెండు టీ20లో కూడా నెగ్గి సిరిస్‌ను దక్కించుకోవాలని భారత్‌ చూస్తోంది.

మరోవైపు శ్రీలంక కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తుది జట్టులో పలుమార్పులు చేసే అవకాశం కూడా ఉంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

పిచ్, వాతావరణం:
ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం బ్యాటింగ్ పిచ్. మంచు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. బౌండరీ చిన్నది కావడంతో పరుగుల వరద పారే అవకాశముంది. వర్ష సూచన లేదు.

జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, ఎంఎస్‌ ధోని, శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌పాండే, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా, బసిల్‌ థంపి
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), డిక్‌వెలా, తరంగ, మాథ్యూస్, కుషాల్‌ పెరీరా, సమరవిక్రమ, గుణరత్నే, షనక, అకిల ధనంజయ, చమీర, ప్రదీప్‌

Live on: రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 13:30 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+