Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: ఆప్ఘన్‌పై న్యూజిలాండ్ విజయం, రికార్డు సృష్టించిన వెటోరి

నేపియర్: ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ ఎలో భాగంగా నేపియర్‌లో న్యూజిలాండ్-ఆప్ఘనిస్ధాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్ధాన్ 47.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో డానియేల్ వెటోరి 4 వికెట్లు తీసుకోగా, బౌల్డ్ 3, ఆండర్సన్ 2, మిల్నే ఒక వికెట్ తీసుకున్నారు.

Bowlers script easy win for NZ

అనంతరం 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 36.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో మార్టిన్ గుప్తిల్ అత్యధికంగా 57 పరుగులు చేయగా, కెప్టెన్ మెక్ కల్లమ్ 42, విలిమన్సన్ 33, ఇలియట్ 19 పరుగులు చేశారు.

టేలర్(24), అండర్‌సన్(7) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆఫ్ఘనిస్ధాన్ బౌలర్లలో జద్రాన్, మహ్మద్ నబీ తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో గుప్తిల్, ఇలియట్ రనౌట్‌గా వెనుదిరగడం విశేషం. ఈ విజయంతో పూల్ ఎ లో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్ధానంలో ఉంది.

రికార్డు సృష్టించిన డానియేల్ వెటోరి

ఐసీసీ వరల్డ్ కప్‌లో నేపియర్‌లో న్యూజిల్యాండ్-ఆప్ఘనిస్ధాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ డానియేల్ వెటోరి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వెటోరి నలుగురిని ఔట్‌ చేశాడు. దీంతో వన్డేల్లో న్యూజిలాండ్ తరపున 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా వెటోరి రికార్డు నెలకొల్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+