స్లెడ్జింగ్ చేస్తాం: కోహ్లీ కోపంగా ఉండాలన్న స్టీవ్ స్మిత్
హైదరాబాద్: వచ్చే ఏడాది భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే మానసికంగా సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కాస్త కోపంగా ఉండాలని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు పెద్ద సవాలే. అయితే ఈ సిరిస్‌లో కెప్టెన్ కోహ్లీ కోపంగా ఉంటే ఆటపై అతడి ఏకాగ్రత చెదురుతుందని, అది ఆసీస్‌కు లాభిస్తుందని స్మిత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.
''అతడు ప్రపంచ స్థాయి ఆటగాడు. గత 18 నెలలుగా భారత జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. ఈ సమయంలో భారత్ చాలా మ్యాచ్‌లు గెలిచింది. ఆ సమయంలో సొంతగడ్డపై భారత్ చాలా క్రికెట్ ఆడింది'' అని ఏబీసీ గ్రాండ్‌స్టాండ్‌కి సోమవారం ఇచ్చిన ఇంటర్యూలో స్మిత్ చెప్పాడు.

మైదానంలో కోహ్లి చాలా భావోద్వేగంతో
‘‘మైదానంలో కోహ్లి చాలా భావోద్వేగంతో ఉంటాడు. అయితే భారత్‌లో అతడు మెరుగ్గా ఉన్నాడని తెలిపాడు. అతడికి కాస్త కోపమొచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు అతడి ఏకాగ్రత చెదురుతుంది. అతడికి చికాకు తెప్పిస్తే టీమిండియా కాస్త బలహీనంగా మారే అవకాశముంది'' అని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్‌పై 4-0తో భారత్ కైవసం
ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌ను 4-0తో భారత్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది కోహ్లీ, అశ్విన్‌లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నైట్ మేర్‌గా ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై కోహ్లీ యావరేజి 60.76
ఆస్ట్రేలియాపై కోహ్లీ యావరేజి 60.76గా ఉంది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన అనేక మ్యాచ్‌ల్లో కోహ్లీ దూకుడుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఒక కేలండర్ ఇయర్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో ఆటగాడిగా కోహ్లీ గుర్తింపు పొందాడు.

ఐదో ఆటగాడిగా కోహ్లీ గుర్తింపు
అంతక ముందు ఒక కేలండర్ ఇయర్‌లో మైఖెల్ క్లార్క్, బ్రెండన్ మెక్ కల్లమ్, రికీ పాంటింగ్, డాన్ బ్రాడ్‌మన్‌లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ 235 పరుగులు చేసిన టెస్టుల్లోనే అత్యధిక పరుగులను నమోదు చేశాడు.

ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు
ఇదిలా ఉంటే ‘‘మేం ఫిబ్రవరిలో భారత్‌కు వెళ్తున్నాం. అది చాలా కఠిన పర్యటన అనడంలో ఎలాంటి సందేహమూ లేదు'' అని స్మిత్ అన్నాడు. ‘‘నాలుగు టెస్టులు ఆడబోతున్నాం. ఇది మా జట్టుకు గొప్ప అవకాశం. భారత్‌లో సిరీస్ గెలుచుకుంటే చాలా గొప్పగా ఉంటుంది'' అని స్మిత్ పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23న పూణెలో ఆరంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications