బరోడా: భారత పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటివాడు కాబోతున్నాడు. ఆరేళ్ళుగా తాను ప్రేమిస్తున్న శివాంగి దేవ్ ను పెళ్ళి చేసుకోబోతున్నాడు. శివాంగి ఆస్ట్రేలియాలోని ఓ దౌత్యాధికారి కూతురు. వీరి పెళ్ళికి తల్లిదండ్రులు ఆమోదం తెలిపారని సమాచారం. 2003లో కాన్ బెరాలో ప్రాక్టీస్ సందర్భంగా శివాంగితో పఠాన్ కు పరిచయమైంది. శివాంగి ఆస్ట్రేలియాలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తోంది. డాన్స్ టీచర్ కూడా. మూడేళ్ళ కిందట పఠానే పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. అయితే మొదట అడ్డుపడ్డ ఇరు కుటుంబాలు తర్వాత పెళ్ళికి అంగీకరించాయి.