
హైదరాబాద్: క్రైస్ట్ చర్చ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫాస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (7/34) కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో రెండో వన్డేలో న్యూజిలాండ్ 204 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 2-0తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నికోలస్ (83 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌కు తోడు రాస్ టేలర్ (57), వర్కర్ (58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్టల్ (49) రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. వెస్టిండిస్ బౌలర్ కాట్రెల్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ బౌల్ట్ ధాటికి 28 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది.
స్పిన్నర్ ఆష్లే నర్స్ చేసిన 27 పరుగులే వీరి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు కావడం విశేషం. ఫెర్గూసన్‌కు మూడు వికెట్లు దక్కాయి. బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇరుజట్ల మధ్య మూడో వన్డే డిసెంబర్ 26(మంగళవారం)న జరుగుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.