ఐపీఎల్ ఆటా లేక వ్యాపారమా?: ఎంసీఏకి ముంబై హైకోర్టు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీ ఆటా లేక వ్యాపారమా? అని ముంబై క్రికెట్ సంఘాన్ని (ఎంసీఏ) ముంబై హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. దీంతో పాటు ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వాంఖడే స్టేడియం, పిచ్ నిర్వహణకు బీఎంసీ నుంచి నీరు తీసుకున్నదీ లేనిదీ తెలియజేయాలని కూడా ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విభా కన్‌కన్‌వాడీలతో కూడిన ధర్మాసనం ఎంసీఏకి నోటీసులు జారీ చేసింది. 2016 వేసవి కాలంలో మహారాష్ట్ర తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోగా.. ఐపీఎల్ కోసం స్టేడియాలకు నీటిని వినియోగించడంపై 'లోక్‌సత్తా మూమెంట్' సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పిటిషన్‌పై వాదనలు
ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం ఎంసీఏకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. 2016 ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మహారాష్ట్రలో తీవ్ర కరువు దృష్ట్యా ఆ ఏడాది ఏప్రిల్ 30 తర్వాత రాష్ట్రంలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను బయటకు తరలించాలని బీసీసీఐకి సూచించిన సంగతి తెలిసిందే.

బీఎంసీ నుంచి నీరు తీసుకున్నారో లేదో తెలియజేయండి
ఇదే పిటిషన్‌పై శుక్రవారం వాదనలు విన్న హైకోర్టు ధర్మానసం ఈ ఏడాది ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియం, పిచ్‌లకోసం బీఎంసీ నుంచి నీరు తీసుకున్నారో లేదో తెలియజేయాలని ఎంసీఏని కోరింది. ‘అసలు ఐపీఎల్ ఆటా లేక వాణిజ్య కార్యక్రమమా? అని కోర్టు తెలుసుకోవాలనుకుంటోంది' అని జస్టిస్ ఓకా అన్నారు.

నీటి సరఫరాను నాలుగు విభాగాలుగా
కాగా, ప్రభుత్వ విధానం ప్రకారం నీటి సరఫరాను నాలుగు విభాగాలుగా విభజించినట్టు వాదనల సందర్భంగా బీఎంసీ హైకోర్టుక తెలిపింది. ఇందులో తాగునీటి సరఫరాను ప్రథమ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఇక పెద్ద పెద్ద కార్యక్రమాలకు (ఐపీఎల్ లాంటివి) నీటి సరఫరాను ఆఖరి కేటగిరిలో చేర్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు.

ఐపీఎల్ ఈ కేటగిరిలోకి వస్తుందా?
ప్రభుత్వ విధానం ప్రకారం ‘సీ' కేటగిరిలో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు నీటిని సరఫరా చేస్తారు. అందువల్ల ఐపీఎల్ ఈ కేటగిరిలోకి వస్తుందా? ఇది వాణిజ్య కార్యక్రమమా అని జస్టిస్ ఓకా ప్రశ్నించారు. దీంతో పాటు ఇంకా వాంఖడే స్టేడియంలో ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవి క్రీడలకు సంబంధించినవా? లేక వ్యాపారానికి సంబంధించినవా ? అన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంసీఏని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications