
హైదరాబాద్ : వట్టి ప్రేమాయాణానికి స్వస్తి చెప్పిన కోహ్లీ తన ప్రేయసి అనుష్కనే పెళ్లాడి ఒకింటి వాడైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమ జంట దంపతులైన క్షణం నుంచి వరుస పెట్టి శుభాకాంక్షలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన వీళ్ల గురించే సంభాషణ జరుగుతుంది. ఈ జంటకు సాధారణ అభిమాని నుంచి సెలబ్రిటీల వరకూ శుభాకాంక్షలు తెలుపుతున్న తరుణంలో ఒకొక్కటి ఒక్కో తీరులో ఉంటున్నాయి.
ఇప్పటి వరకు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఇప్పుుడు వైస్ కెప్టెన్ అవబోతున్నాడని మరొకరు ట్వీట్ పేల్చారు. అతనెవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా భర్త అయిన బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్. అయితే సరదాకి చేసింది అయినా దానిపై నిజమెంతో అని అందరూ నెట్‌లో వెతుకుతూనే ఉన్నారు. టీమిండియా కెప్టెన్ ఇకపై వైస్‌కెప్టెన్. పెళ్లి తర్వాత అనుష్కకి కెప్టెన్సీ వచ్చింది. కొత్త జంటకు శుభాకాంక్షలు అని రితేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం హనీమూన్ సంతోషంలో ఉన్న ఈ జంటకు కొత్త అందాలు చూడటంలోనే కాదు. సెలబ్రిటీలు పంపే శుభాకాంక్షలతో సైతం బిజీగానే ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.