For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్, కోహ్లీ, రోహిత్ కాదు.. చిత్రాంగదా సింగ్‌కు ఇష్టమైన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?!!

Bollywood actress Chitrangada Singh Reveals Her Favourite Indian Cricketer

ముంబై: లాక్‌డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన సెలెబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో మాత్రం తెగ సందడి చేస్తున్నారు. ఒకవైపు అభిమానులకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు ఇంట్లో వారు చేసే సరదా పనులను నెట్టింట్లో పోస్టు చేసి అలరిస్తున్నారు. ఇక అభిమానులతో చిట్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ షోలు కూడా చేస్తున్నారు. ఇందులో అభిమానులు అడిగే సరదా ప్రశ్నలకి సమాధానాలిస్తూ.. తమ అభిరుచుల్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగదా సింగ్ ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించింది.

ధోనీ అంటే ఇష్టం

ధోనీ అంటే ఇష్టం

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ ట్విట్టర్‌లో అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. ఫాన్స్ అడిగే ప్రశ్నలకు తనదైన స్టయిల్లో జవాబులిచ్చింది. ట్విట్టర్‌ చాట్ సందర్భంగా ఓ అభిమాని సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని ప్రశ్నించాడు. బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగదా వెంటనే ధోనీ అని సమాధానం ఇచ్చింది.

మీడియాలో వైరల్

మీడియాలో వైరల్

ప్రస్తుతం చిత్రాంగద సింగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్వీట్ అప్పుడే లక్షల్లో లైకులు, కామెంట్లు సంపాదించింది. ఇక మహీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఎంఎస్ ధోనీ గత 8 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమయ్యాడు. కనీసం దేశవాళీ టోర్నీల్లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ.. ధోనీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2005లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు.

చిత్రాంగదా రూటే సెపరేటు

చిత్రాంగదా రూటే సెపరేటు

బాలీవుడ్‌ కథానాయికల్లో చిత్రాంగదా సింగ్‌ రూటే సెపరేటు. ఉన్నది ఉన్నట్లు నికచ్చిగా మాట్లాడుతుంది. ఆ కారణంగా ఆమె కొన్ని సినిమాల్లో ఆఫర్లు కూడా పోగొట్టుకుంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ఖిఖితో గొడవపడి ఓ సినిమా నుంచి తప్పుకొన్నారు కూడా. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా చిత్రాంగదా సందడి చేసింది. ఓ డ్యాన్స్‌ రియాలిటీ షో న్యాయనిర్ణేతగా కనిపించి హల్చల్ చేసింది.

ప్రపంచకప్‌లో ఆడటంపై సందేహాలు

ప్రపంచకప్‌లో ఆడటంపై సందేహాలు

ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడి ఫామ్ నిరూపించుకోవడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎంఎస్ ధోనీ ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐపీఎల్-13 నిరవధికంగా వాయిదా పడిపోయింది. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే కొందరు మాజీలు మహీ మెగా టోర్నీ ఆడాలని సూచిస్తుండగా.. మరికొందరు ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జాలుగుతుందో చూద్దాం.

Story first published: Monday, April 20, 2020, 18:14 [IST]
Other articles published on Apr 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+