For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ.. ఆ ఆస్ట్రేలియా దిగ్గజం ఇకలేరు!

Bob Cowper: ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ క్రికెటర్ బాబ్ కౌపర్ 84 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. శనివారం ఉదయం మెల్‌బోర్న్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. బాబ్ కౌపర్ చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన బాబ్ కౌపర్.. 27 టెస్టుల్లో 46.84 సగటుతో 2061 పరుగులు చేశాడు. 1966లో మెల్‌బోర్న్ టెస్టులో ఇంగ్లాండ్‌పై 307 పరుగులతో కౌపర్ తన సత్తాను చాటుకున్నారు. దీంతో అనేక రికార్డులు సృష్టించాడు.

సంతాపం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా క్రికెట్
బాబ్ కౌపర్ మృతికి ఆస్ట్రేలియా క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. 'బాబ్ కౌపర్ అత్యంత ప్రతిభావంతుడైన ఎడమచేతి వాటం బ్యాటర్. బాబ్ కౌపర్ సొగసైన స్ట్రోక్ ప్లే, క్రీజులో ఓపికతో పెద్ద స్కోర్లు చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు." అని ఆస్ట్రేలియా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కౌపర్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎక్కువ భాగం విక్టోరియా తరఫున ఆడాడు. ఆ సమయంలో బాబ్ కౌపర్ 147 మ్యాచ్‌ల్లో 10,595 పరుగులు చేశాడు. 183 వికెట్లు కూడా తీసుకున్నాడు.

Bob Cowper Australian Legend Who Scored the First Test Triple Century Passes Away

బాబ్ కౌపర్ చేసిన 307 పరుగుల ఇన్నింగ్స్ ఆస్ట్రేలియన్ గడ్డపై టెస్ట్ క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ. 20వ శతాబ్ధంలో అదే తొలి ట్రిపుల్ సెంచరీ. కౌపర్ స్వదేశంలో 75.78 సగటు స్కోరుతో మరింత మెరగ్గా ఉన్నాడు. విదేశీ గడ్డపై కౌపర్ సగటు కేవలం 33.33 మాత్రమే. కౌపర్ స్వదేశీ, విదేశీ బ్యాటింగ్ సగటు మధ్య వ్యత్యాసం 42.45. ఇది ఒక రికార్డు. డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ సగటు కలిగిన బ్యాటర్ బాబ్ కౌపర్. బ్రాడ్‌మాన్ టెస్టులలో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. కానీ రెండూ విదేశీ గడ్డపై వచ్చాయి.

బాబ్ కౌపర్ 1968లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఆ సమయంలో కౌపర్ వయస్సు కేవలం 27 సంవత్సరాలే. తన వ్యాపారంపై దృష్టి పెట్టడానికి క్రికెట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కౌపర్ ఆట నుంచి రిటైర్ అయినప్పటి నుంచి వ్యాపారంలో విజయాలను సాధించాడు. ఇది కాకుండా కౌపర్ క్రికెట్ రిఫరీగా కూడా పని చేశాడు. అతను రెండు టెస్టులు, 14 వన్డేలలో రిఫరీగా వ్యవహరించాడు.

Story first published: Sunday, May 11, 2025, 13:54 [IST]
Other articles published on May 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+