For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్‌తో సమానం'

స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్ లాంటిదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తెలిపాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'స్పాట్‌ఫిక్సింగ్‌ క్యాన్సర్‌తో సమానం.

By Nageshwara Rao
Boards need to monitor T20 leagues to curb corruption: Waqar

హైదరాబాద్: స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్ లాంటిదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తెలిపాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'స్పాట్‌ఫిక్సింగ్‌ క్యాన్సర్‌తో సమానం. ఒక్క క్రికెట్‌లోనే కాదు ఆటగాళ్లు ఏ క్రీడలోనైనా ఫిక్సింగ్‌కు పాల్పడితే అది క్షమించరాని తప్పు. ఫిక్సింగ్‌ భూతాన్ని తరిమికొట్టాలంటే ఆ దేశ బోర్డులే జోక్యం చేసుకోవాలి' అని అన్నాడు.

పలు దేశాల్లో టీ20 లీగ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బోర్డులు, ఫ్రాంఛైజీల యాజమాన్యాలు ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నాడు. అలా చేయకపోతే గత సీజన్‌లో లాగానే ఫిక్సింగ్‌ భూతం తిరిగి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ప్రవేశిస్తుందని చెప్పాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ జట్టుకు వకార్ బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు.

పాక్‌ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడూతూ తరచూ నిషేధానికి గురవుతున్న సంగతి తెలిసిందే. 2010లో అప్పటి పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌, మహమ్మద్‌ ఆసిఫ్‌, మహమ్మద్‌ ఆమిర్‌ ఇంగ్లాండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పిడి ఐదేళ్ల నిషేధానికి గురయ్యారు.

ఆ తర్వాత 2012లో పాక్‌ ఆటగాడు కనేరియా తన సహచర ఆటగాళ్లతో ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు బుకీలను కలిసినట్లు తేలడంతో అతనిపై జీవితకాల నిషేధాన్ని ఐసీసీ విధించింది. ఇక, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) రెండో సీజన్‌లోనూ పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 18, 2017, 12:19 [IST]
Other articles published on Nov 18, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+