న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్ల విజృంభణ: 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సఫారీలు

Board Presidents XI vs South Africa, Day 2 LIVE: Umesh, Porel strike early


హైదరాబాద్: దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గురువారం వర్షం కారణంగా తొలిరోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

ఇక, శుక్రవారం ఉదయం కూడా ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండడంతో అంఫైర్లు మధ్యాహ్నాం టాస్ వేశారు. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ ఐయిడెన్ మర్క్రమ్(32), జుబెయిర్ హంజ్జా(10) పరుగులతో ఉన్నారు. అంతకముందు జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఓపెనర్ డీన్ ఎల్గర్(6) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పాంచాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ధోని తర్వాత ఎవరు?: నికర ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!ధోని తర్వాత ఎవరు?: నికర ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఆ తర్వాత పది పరుగుల వ్యవధిలోనే ఇషాన్ పోరెల్ బౌలింగ్‌లో థియునిస్ డి బ్రూయిన్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నందున ఈ వార్మప్ మ్యాచ్‌ని వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఇరు జట్ల మధ్య ముగిసిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. ఈ వార్మప్ మ్యాచ్ శనివారంతో ముగియనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు అక్టోబరు 2న విశాఖ వేదికగా ఆరంభం కానుంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

జట్ల వివరాలు
బోర్డు ఎలెవెన్‌ : రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, ప్రియాంక్‌ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్‌ నాయర్, సిద్దేశ్‌ లాడ్, కేఎస్‌ భరత్, జలజ్‌ సక్సేనా, ధర్మేంద్ర సింగ్‌ జడేజా, అవేష్‌ ఖాన్, ఇషాన్‌ పొరెల్, శార్దుల్‌ ఠాకూర్, ఉమేశ్‌ యాదవ్‌.

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్‌ మహరాజ్, మార్క్‌రమ్, సెనురాన్‌ ముతుస్వామి, ఇన్‌గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్‌.

Story first published: Friday, September 27, 2019, 14:33 [IST]
Other articles published on Sep 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X